ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nitish kumar: కొత్త పార్లమెంటు ఎందుకు?: నితీష్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-05-27T13:33:50+05:30

కొత్త పార్లమెంటు భవనం ఈనెల 28న ప్రారంభమవుతుండగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కొత్త పార్లమెంటు భవనం అవసరం ఏమిటని నిలదీశారు. మోదీ అధ్యక్షతను శనివారం ఏర్పాటయిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకావడంలోనూ అర్ధం లేదన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనం (New parliament Building) ఈనెల 28న ప్రారంభమవుతుండగా, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ (Nitish Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కొత్త పార్లమెంటు భవనం అవసరం ఏమిటని ఆయన నిలదీశారు. మోదీ అధ్యక్షతను శనివారం ఏర్పాటయిన నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశానికి హాజరుకావడంలోనూ అర్ధం లేదన్నారు. శనివారంనాడిక్కడ మీడియాతో నితీష్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో అధికారంలో ఉన్న వారు భారతదేశ చరిత్రను మార్చేస్తున్నారని ఆరోపించారు.

''దేశ చరిత్రను అధికారంలో ఉన్న పెద్దలు మార్చేస్తున్నారంటూ పదేపదే నేను చెబుతూనే ఉన్నాను. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు దేశ చరిత్రలో ఒక భాగం. ఈ ప్రభుత్వం (కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం) కొత్త పార్లమెంటు భవనం నిర్మించాలని తహతహలాడింది. దేశ చరిత్రను మార్చాలనే ఉద్దేశమే ఇందుకు కారణం'' అని నితీష్ అన్నారు. శనివారంనాటి నీతి ఆయోగ్ సమావేశానికి కానీ, ఆదివారం కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి కానీ హాజరుకావడం అర్ధం లేదని నితీష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించాలన్న డిమాండ్‌తో 28వ తేదీ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు జేడీయూ ఇప్పటికే ప్రకటించింది.

పార్లమెంటరీ వ్యవ్థలో రాష్ట్రపతికి కీలక పాత్ర ఉందని, ద్రౌపది ముర్ము అత్యున్నత రాజ్యాంగ పదవిని నిర్వహిస్తున్నారని, ఆయన మోదీ ఆహ్వానించి, ఆమె చేతుల మీదుగా పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేషఅ సింగ్ కుష్వాహ ఇటీవల అన్నారు. అయితే నైతిక విలువలకు తిలోదకాలిస్తూ ప్రధాని స్వయంగా తానే పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించబోతున్నారంటూ విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-05-27T13:33:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising