North Korea: ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం...కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరిక
ABN, First Publish Date - 2023-02-20T08:10:27+05:30
ఉత్తర కొరియా సోమవారం బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది...
సీయోల్ (ఉత్తర కొరియా): ఉత్తర కొరియా సోమవారం బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.(North Korea Fires) అమెరికా-దక్షిణ కొరియా కసరత్తుల తర్వాత నార్త్ కొరియా 48 గంటల్లోనే బాలిస్టిక్ క్షపణిని(Ballistic Missile) ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఉత్తర కొరియా సోమవారం తూర్పు సముద్రం వైపు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని సియోల్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపింది.
ఇది కూడా చదవండి : Asaduddin Owaisi : ఢిల్లీలో ఎంపీ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి...పగిలిన కిటికీలు
సోమవారం ఉదయం ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని జపాన్ ప్రధాని కార్యాలయం కూడా ట్వీట్ చేసింది.యునైటెడ్ స్టేట్స్, దక్షిణ కొరియా ఆదివారం సంయుక్తంగా ఎయిర్ డ్రిల్స్ నిర్వహించిన నేపథ్యంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరిక జారీ చేశారు. తమ ఫైరింగ్ రేంజ్ గా ఫిసిఫిక్ ను మారుస్తామని కిమ్ జోంగ్ హెచ్చరించారు.
Updated Date - 2023-02-20T08:10:29+05:30 IST