ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hello! UPI : డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా? అయితే మీకు ఓ శుభవార్త!

ABN, First Publish Date - 2023-09-07T15:21:14+05:30

లావాదేవీలను నిర్వహించేవారికి అత్యంత అనుకూలంగా ఈ సదుపాయాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) వేదికపై చెల్లింపుల కోసం నూతన అవకాశాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభించింది.

న్యూఢిల్లీ : నగదు రహిత లావాదేవీల నిర్వహణ కోసం మరింత ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. లావాదేవీలను నిర్వహించేవారికి అత్యంత అనుకూలంగా ఈ సదుపాయాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) వేదికపై చెల్లింపుల కోసం నూతన అవకాశాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభించింది. భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో ఈ సదుపాయాలను ఆవిష్కరించారు.

సమ్మిళిత, పటిష్ట, సుస్థిర డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను సృష్టించాలనే లక్ష్యంతో ఈ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ, యూపీఐ ఎల్ఐటీఈ ఎక్స్, ట్యాప్ అండ్ పే, హెలో! యూపీఐ - యూపీఐతో సంభాషిస్తూ చెల్లింపులు చేయడం, బిల్‌పే కనెక్ట్ - సంభాషిస్తూ బిల్లు చెల్లించడం కోసం సదుపాయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

కృత్రిమ మేధాశక్తి (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహకారంతో మానవుడు-యంత్రం మధ్య సంభాషణ ద్వారా లావాదేవీలను నిర్వహించేందుకు కన్వర్సేషనల్ యూపీఐ పేమెంట్స్, కన్వర్సేషనల్ బిల్ పేమెంట్స్ అవకాశం కల్పిస్తాయి. దీనివల్ల మన దేశంలో డిజిటల్ పేమెంట్లు మరింత పెరుగుతాయి.


హెలో! యూపీఐని ఉపయోగించి వాయిస్ ఎనేబుల్డ్ యూపీఐ పేమెంట్లు చేయవచ్చు. నిర్ణీత మొత్తాన్ని మాటల్లో చెప్పడం ద్వారా చెల్లింపులు జరపవచ్చు. యాప్స్, టెలికాం కాల్స్, ఐఓటీ డివైసెస్ ద్వారా ఈవిధంగా లావాదేవీలను జరపవచ్చు. ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. త్వరలోనే మరికొన్ని ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి వస్తుంది. ప్రాంతీయ భాషల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే సీనియర్ సిటిజెన్లు, డిజిటల్ రంగంలో అనుభవం లేనివారు కూడా లావాదేవీలను నిర్వహించగలుగుతారు. వేరొకరి ఖాతాకు ఎంత సొమ్ము బదిలీ చేయాలి? యూపీఐ పిన్ నెంబరు వంటివాటిని నోటి మాటల ద్వారా కమాండ్స్ ఇచ్చి, యూపీఐ లావాదేవీని పూర్తి చేయవచ్చు.

బిల్‌పే కనెక్ట్-కన్వర్సేషనల్ బిల్ పేమెంట్స్

దేశవ్యాప్తంగా బిల్లు చెల్లింపుల కోసం నేషనలైజ్డ్ నంబరును భారత్ బిల్‌పే అందుబాటులోకి తీసుకొచ్చింది. మెసేజింగ్ యాప్‌లో 'Hi' అని మెసేజ్ పంపించి బిల్లులను చెల్లించవచ్చు. స్మార్ట్‌ఫోన్ లేనివారు, మొబైల్ డేటా యాక్సెస్ లేనివారు కూడా మిస్డ్ కాల్ ఇచ్చి బిల్లులను చెల్లించవచ్చు. మిస్డ్ కాల్ ఇస్తే, వెంటనే ఫోన్ వస్తుంది. సొమ్ము చెల్లింపు గురించి వెరిఫికేషన్ చేసి, చెల్లింపు చేయమని కమాండ్ ఇస్తే, చెల్లింపు పూర్తవుతుంది. బిల్‌పే కనెక్ట్‌లో మరొక సదుపాయం కూడా ఉంది. నోటి మాటలతో కమాండ్స్ ఇచ్చి, బిల్లులను చెల్లించడానికి అవకాశం ఉంది. కస్టమర్లు తమ స్మార్ట్ హోం డివైజెస్‌లో వాయిస్ కమాండ్స్ ఇచ్చి, బిల్లులను చెల్లించవచ్చు. వెంటనే వాయిస్ కన్ఫర్మేషన్ వస్తుంది. భౌతికంగా కనిపించే వసూలు కేంద్రాల్లో బిల్లులను చెల్లించినపుడు సౌండ్ బాక్స్ డివైసెస్ ద్వారా చెల్లింపు వివరాలను వెల్లడిస్తారు. దీనివల్ల కస్టమర్లకు, కలెక్షన్ సెంటర్లకు తగినంత భద్రత ఉంటుంది.

రుణాలు

కస్టమర్లు బ్యాంకుల నుంచి యూపీఐ ద్వారా ప్రీ-శాంక్షన్డ్ రుణాలను తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. యూపీఐ ఎల్ఐటీఈ ఎక్స్, ట్యాప్ అండ్ పే ద్వారా యూజర్లు పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉంటూనే సొమ్మును పంపించవచ్చు, స్వీకరించవచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ సజావుగా లేని ప్రాంతాల్లో కూడా లావాదేవీలకు ఇది ఉపయోగపడుతుంది.


ఇవి కూడా చదవండి :

ఖలిస్థానీ తీవ్రవాదాన్ని సహించం!

Aditya L1 Mission: సెల్ఫీ తీసుకున్న ఆదిత్య ఎల్1.. మరో ఫొటో అయితే నిజంగా అద్భుతమే..

Updated Date - 2023-09-07T15:21:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising