ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Odisha train accident: ప్రమాదానికి గురైన రైల్ కోచ్‌ల నుంచి ఒకటే దుర్వాసన.. ఇంకా శవాలు ఉన్నాయా?.. రైల్వే అధికారి సమాధానమిదే...

ABN, First Publish Date - 2023-06-10T16:08:29+05:30

ఒడిశారైలు ప్రమాద ఘటన జరిగి వారం గడిచిపోయింది 288 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో మృతి చెందగా..1100 మంది క్షతగాత్రులయ్యారు. అయితే ప్రమాదం జరిగిన బహనగ బజార్ రైల్వేస్టేషన్(Bahanaga Bazar Railway Station )పరిధిలోని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదంలో దెబ్బతిన్న రైల్వే బోగీ నుంచి దుర్వాసన వస్తుందని.. ఇంకా అందులో శవాలు ఉన్నాయా? అని సందేహాన్ని లేవనెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్: ఒడిశారైలు ప్రమాద ఘటన(Odisha Train Accident) జరిగి వారం గడిచిపోయింది. రైల్వేచరిత్రలో అత్యంత విషాదం మిగిల్చిన ఘోర ప్రమాదం ఇదే. 288 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో మృతి చెందగా..1100 మంది క్షతగాత్రులయ్యారు. అయితే ప్రమాదం జరిగిన బహనగ బజార్ రైల్వేస్టేషన్(Bahanaga Bazar Railway Station )పరిధిలోని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదంలో దెబ్బతిన్న రైల్వే బోగీ నుంచి దుర్వాసన వస్తుందని.. ఇంకా అందులో శవాలు ఉన్నాయా? అని సందేహాన్ని లేవనెత్తారు. అయితే స్థానికుల ఆందోళనకు రైల్వే అధికారుల సమాధానం చాలా వింతగా అనిపించింది.

స్థానికుల ఆందోళనపై స్పందించిన రైల్వే అధికారులు...రైల్వే బోగీలో మృతదేహాలు(Dead Bodies) లేవని.. ఆ దుర్వాసనకు కుళ్లిన కోడిగుడ్లు(Eggs) కారణమని తెలిపారు. దుర్వాసనకు కుళ్ళిన గుడ్లు కారణమని మరియు "మానవ శరీరాలు(Human bodies)" కాదని పేర్కొన్నారు, గమనింపబడని ప్రాణనష్టం గురించి ఏవైనా దీర్ఘకాలిక భయాలను ఉంచారు.

అవి కోడిగుడ్లు.. మృతదేహాలు కాదు..

‘‘రైల్వే బోగీ నుంచి వస్తున్న వాసనకు కారణం కుళ్లిన కోడిగ్రుడ్లు.. మానవ మృతదేహాలు కాదు.. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలచే రెండు సార్లు ఆ ప్రాంతాన్ని క్లియర్ చేశాం. హౌరా ఎక్స్‌ప్రెస్ పార్శిల్ వ్యాన్‌లో దాదాపు 3 టన్నుల గుడ్లు రవాణా చేస్తున్నట్లు’’ సౌత్ ఈస్ట్రన్ రైల్వే సీపీఆర్‌వో ఆదిత్యా కుమార్ చౌదరి(South Eastern Railway CPRO Aditya Kumar Chaudhary) చెప్పారు. అన్ని గుడ్లు కుళ్లిపోయి దుర్వాసన వస్తోందని తెలిపారు.

కాగా.. ఈ ఘోర ప్రమాదంలో 280 మృతిచెందిన విషయం తెలిసిందే. వీటిలో 200 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు రైల్వే అధికారులు. ఇంకా గుర్తించబడని 80 మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్(AIIMS) మార్చురీలో భద్రపరిచారు.

ఈ ఘోరప్రమాదంలో ఇంటర్ లాకింగ్ సిస్టమ్‌లో మార్పులతో క్రిమినల్ చర్య భావిస్తున్నామని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ కేసులో నిజానిజాలను తేల్చేందుకు సీబీఐ విచారణకు ఆదేశించామని అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Updated Date - 2023-06-10T16:08:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising