Operation Kaveri: ఆపరేషన్ కావేరి పూర్తి... మొత్తం ఎంతమంది భారతీయులు సూడాన్‌నుంచి సురక్షితంగా వచ్చారంటే?
ABN, First Publish Date - 2023-05-05T23:11:46+05:30
ఆపరేషన్ కావేరి(Operation Kaveri) పూర్తయింది. సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణతో అతలాకుతలమైన సూడాన్ నుంచి
న్యూఢిల్లీ: ఆపరేషన్ కావేరి(Operation Kaveri) పూర్తయింది. సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణతో అతలాకుతలమైన సూడాన్ నుంచి ఆపరేషన్ కావేరీ ద్వారా 3862 మంది భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చారు. ఈ సహాయక కార్యక్రమంలో భారత వాయు సేన (Indian Air Force-IAF), నేవీ సిబ్బంది కీలక పాత్ర పోషించారు.
‘ఆపరేషన్ కావేరీ’లో భాగంగా ఐఏఎఫ్ విమానాల్లో భారత్‌కు సురక్షితంగా చేరుకున్న వారిలో 90 సంవత్సరాల వయసు పైబడినవారు కూడా ఉన్నారని తెలిపింది. వీరిలో ఒకరి వయసు 102 సంవత్సరాలని వివరించింది.
ఆపరేషన్ కావేరీలో భాగంగా భారత ప్రభుత్వం సైనిక విమానాలు, యుద్ధ నౌకలతో భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది. ఇండిగో విమానాల్లో కూడా కొందరిని తీసుకొచ్చారు.
ఏమిటి ఈ యుద్ధం?
సూడాన్ ఆర్మీ లీడర్ అబ్డెల్ ఫట్టాహ్ అల్-బుర్హాన్, ఆయన సబార్డినేట్ అధికారి, పారామిలిటరీ రేపిడ్ సపోర్ట్ సోల్జర్స్ కమాండర్ మహమ్మద్ హమ్దాన్ డగ్లో వర్గాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో 528 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 4,599 మంది గాయపడ్డారు. దీంతో సూడాన్ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఆ దేశంలో 150 సంవత్సరాల నుంచి ఉంటున్న 3862 భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురాగలిగారు.
Updated Date - 2023-05-05T23:11:50+05:30 IST