ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

oppositions : ‘ఇండియా’ను చూసి మోదీ వణుకుతున్నారు

ABN, First Publish Date - 2023-07-26T03:13:25+05:30

ప్రధాని మోదీ(PM MODI) వ్యాఖ్యలపై విపక్షాలు(oppositions) మండిపడ్డాయి. 26 పార్టీలతో కూడిన విపక్ష కూటమి ‘ఇండియా’(India)ను చూసి మోదీ భయకంపితులయ్యారని పేర్కొన్నాయి.

మణిపూర్‌ నుంచి దృష్టి మరల్చాలని చూస్తున్నారు

ప్రతిపక్షాలను ఉగ్రవాద సంస్థలతో పోల్చుతారా?

మోదీ వ్యాఖ్యలపై విపక్ష నేతల ధ్వజం

మణిపూర్‌ నుంచే భారత్‌ను పునఃనిర్మిస్తాం: రాహుల్‌

‘ఇండియా’ను చూసి మోదీ వణుకుతున్నారు

న్యూఢిల్లీ, జూలై 25: ప్రధాని మోదీ(PM MODI) వ్యాఖ్యలపై విపక్షాలు(oppositions) మండిపడ్డాయి. 26 పార్టీలతో కూడిన విపక్ష కూటమి ‘ఇండియా’(India)ను చూసి మోదీ భయకంపితులయ్యారని పేర్కొన్నాయి. మణిపూర్‌(Manipur) వివాదం నుంచి ప్రజల దృష్టి మరల్చటానికే ఆయన అటువంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించాయి. కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు ఖర్గే మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ, ‘మంటల్లో చిక్కుకున్న మణిపూర్‌ గురించి మనమందరం మాట్లాడుతుంటే ప్రధాని ఈస్ట్‌ ఇండియా కంపెనీ అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు’ అని విమర్శించారు. అనంతరం ఆయన ఈ అంశంపై ట్విట్టర్‌లో కూడా స్పందించారు. ‘‘బ్రిటీషు వారికి బానిసల్లాగా పని చేసిన వారే బీజేపీ పూర్వీకులు. వారు ఏనాడూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనలేదు. మహాత్మాగాంధీని హత్య చేసిన వారి సిద్ధాంతాన్ని పాటించేవారు మాకు దశదిశ లేదని అంటున్నారు. స్పష్టత లేనిది మాకు కాదు ప్రధానికే’’ అని ఖర్గే పేర్కొన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) స్పందిస్తూ.. ‘మీకు నచ్చినట్లుగా మమ్మల్ని అనండి. మేం ఇండియా. మణిపూర్‌ గాయాలు మానేలా మేం కృషి చేస్తాం. మహిళలు, చిన్నారుల కన్నీళ్లను తుడుస్తాం. ప్రేమను, శాంతిని మేం పునరుద్ధరిస్తాం. భారత్‌ అనే భావనను మణిపూర్‌లో పునఃనిర్మిస్తాం’ అని చెప్పారు. ఇండియా కూటమి ఏర్పాటు వల్ల తనలో కలిగిన భయాన్ని దాచుకోవటానికే విపక్షాలను ఉగ్రవాద సంస్థలతో పోల్చారని టీఎంసీ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌ విమర్శించారు.

Updated Date - 2023-07-26T03:13:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising