ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Parliament Security Breach: కొనసాగుతున్న ఎంపీల సస్పెన్షన్ పర్వం.. మరో 30 మందిపై వేటు

ABN, Publish Date - Dec 18 , 2023 | 04:23 PM

పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన తీవ్రమైనదని, దీనిపై చర్చ అవసరం లేదని, సమగ్ర విచారణ జరగాలని ప్రధాన మంత్రి మోదీ పిలుపునిచ్చినప్పటికీ ఉభయసభల్లో ప్రతిపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఒక ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు పట్టువిడుపులు లేని ధోరణిలో ఆందోళన సాగిస్తుండటంతో తాజాగా 30 మందికి పైగా ఎంపీలు సస్పెండయ్యారు.

న్యూఢిల్లీ: పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన (Parliament Security Breach) తీవ్రమైనదని, దీనిపై చర్చ అవసరం లేదని, సమగ్ర విచారణ జరగాలని ప్రధాన మంత్రి మోదీ పిలుపునిచ్చినప్పటికీ ఉభయసభల్లో ప్రతిపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఒక ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు పట్టువిడుపులు లేని ధోరణిలో ఆందోళన సాగిస్తుండటంతో తాజాగా 30 మందికి పైగా ఎంపీలు సస్పెండయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకూ వీరి సస్పెన్షన్ అమల్లో ఉంటుంది.


కాగా, ఇదే కారణంతో గత వారంలో 13 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. వీరితో పాటు ప్రివిలిజ్ కమిటీ వద్ద నివేదిక పెండింగ్‌లో ఉన్నందున మరో ముగ్గురు ఎంపీలు కూడా సస్పెన్షన్‌లో ఉన్నారు. మొత్తంగా 46 మంది ఎంపీలపై ఈ సమావేశాల్లో వేటుపడగా, వీరిలో 43 మంది భద్రతా ఉల్లంఘనపై హోం మంత్రి ప్రకటనకు డిమాండ్ చేస్తూ సస్పెండయ్యారు. సస్పెండయిన ఎంపీలలో లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, ఆ పార్టీ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కల్యాణ్ బెనర్జీ, కోకిల ఘోష్ దస్తిదార్, సౌగత్ రాయ్, శతాబ్ది రాయ్, డీఎంకే సభ్యులు ఎ.రాజా, దయానిధి మారన్ తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 04:26 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising