ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nawaz Sharif: భారత్ చంద్రునిపైకి చేరుకుంటే.. పాకిస్తాన్ ప్రపంచం ముందు అడుక్కుంటోంది: నవాజ్ షరీఫ్

ABN, First Publish Date - 2023-09-19T20:29:24+05:30

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తాజాగా భారతదేశంపై ప్రశంసలు కురిపిస్తూ, తమ దేశంపై విమర్శలు గుప్పించారు. భారతదేశం చంద్రునిపైకి చేరుకోవడంతో పాటు ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యమిస్తుంటే..

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తాజాగా భారతదేశంపై ప్రశంసలు కురిపిస్తూ, తమ దేశంపై విమర్శలు గుప్పించారు. భారతదేశం చంద్రునిపైకి చేరుకోవడంతో పాటు ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యమిస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ప్రపంచం ముందు అడుక్కుతింటోందని కుండబద్దలు కొట్టారు. మాజీ జనరల్స్‌, జడ్జీలు పాక్ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేయడం వల్లే.. పాక్‌కి ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. కొన్ని సంవత్సరాల నుంచి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనమవుతూ వస్తోందని.. ఇప్పుడు రెండంకెల ద్రవ్యోల్బణం రూపంలో పేద ప్రజలపై తీవ్ర ఒత్తిడిని తీసుకువస్తోందని అభిప్రాయపడ్డారు. సోమవారం సాయంత్రం లాహోర్‌లో జరిగిన వర్చువల్ మీటింగ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ‘‘భారతదేశం ఇప్పుడు చంద్రునిపైకి చేరుకుంది. జీ20 సమావేశాలను సైతం నిర్వహించింది. కానీ.. పాకిస్తాన్ మాత్రం నిధుల కోసం దేశాలు పట్టుకొని తిరుగుతోంది. ఎందుకు భారత్ తరహాలో పాకిస్తాన్ ఘనతల్ని సాధించలేదు? దీనికి బాధ్యులెవరు?’’ అని అడిగారు. అటల్ బిహారీ వాజ్‌పేయి భారత ప్రధాని అయినప్పుడు.. ఆ దేశం ఖాతాలో కేవలం ఒక బిలియన్ డాలర్లు మాత్రమే ఉండేవని గుర్తు చేసుకున్నారు. కానీ.. ఇప్పుడు భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు 600 బిలియన్ డాలర్లకు పెరిగాయని తెలిపారు. అంచలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు భారతదేశం ఎక్కడికో చేరుకుందని కొనియాడారు. కానీ.. పాకిస్తాన్ మాత్రం నిధుల కోసం ప్రపంచం మొత్తం అడుక్కుంటూ తిరుగుతోందని దుయ్యబట్టారు.

ఇదిలావుండగా.. నవాజ్ షరీఫ్ పేరు పనామా పేపర్స్ లీక్‌లో రావడంతో, పాక్ సుప్రీంకోర్టు ఆయనపై అనర్హత వేటు వేసింది. దాంతో ఆయన గద్దె నుంచి దిగాల్సి వచ్చింది. అనంతరం 2019లో అల్-అజీజియా అవినీతి కేసులో లాహోర్ కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే.. ఆయన అనారోగ్యానికి గురవ్వడంతో చికిత్స నిమిత్తం లండన్ వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ప్రవాసంలో గడుపుతున్న నవాజ్.. అక్టోబర్ 21వ తేదీన దేశానికి తిరిగి వస్తున్నట్టు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వస్తున్నానని స్పష్టం చేసిన ఆయన.. ఈ ఎన్నికల్లో తన పార్టీ తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు.. నవాజ్ షరీఫ్‌ను ఘనంగా ఘనంగా స్వాగతించేందుకు పార్టీ సభ్యులు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2023-09-19T20:29:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising