ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Seema Haider: సీమా హైదర్ పక్కా ప్లాన్?.. పాక్ నుంచి భారత్‌లోకి ప్రవేశించడానికి ముందు ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2023-07-19T17:35:12+05:30

ప్రియుడి కోసం నలుగురు పిల్లలతో కలిసి పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్ (Seema Haider) వ్యవహారంలో కొత్త కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. అచ్చం భారతీయ మహిళ మాదిరిగా కనిపించేలా మేకప్ కోసం ప్రొఫెషనల్స్ సాయం కోరినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌లోకి రావడానికి ముందే మేకప్‌పై దృష్టిపెట్టిందని వెల్లడించాయి.

న్యూఢిల్లీ: ప్రియుడి కోసం నలుగురు పిల్లలతో కలిసి పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్ (Seema Haider) వ్యవహారంలో కొత్త కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. అచ్చం భారతీయ మహిళ మాదిరిగా కనిపించేలా మేకప్ కోసం ప్రొఫెషనల్స్ సాయం కోరినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌లోకి రావడానికి ముందే మేకప్‌పై దృష్టిపెట్టిందని వెల్లడించాయి.

భారతీయ ఆకృతి కనిపించేలా చాలా జాగ్రత్త వహించిందని, పిల్లల విషయంలో కూడా ఇదే జాగ్రత్త తీసుకొందని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. సెక్యూరిటీ ఏజెన్సీలు గుర్తించకుండా సీమా హైదర్ ఈ విధమైన పక్కా ప్రణాళిక ఎంచుకుందని వివరించాయి.

సాధారణంగా ఈ తరహా విధానాలను మానవ అక్రమ రవాణా కోసం ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఇంటి పనుల కోసం, వ్యభిచార కూపంలోకి దింపేందుకు ఈ విధంగా వేషధారణలు మార్చివేసి ఇండో-నేపాల్ బోర్డర్ దాటిస్తుంటారని ఇంటెలిజెన్స్ వర్గాలు వివరించాయి.

ఇక సీమా హైదర్ ఒక వేషధారణ మార్చుకోవడమే కాదు, భాషనైపుణ్యాలు కూడా ఉన్నాయని, అనర్గళంగా మాట్లాడుతోందని రిపోర్టులు చెబుతున్నాయి. నేపాల్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్న పాకిస్తానీ నిర్వహకులు ఆమెకు శిక్షణ ఇచ్చి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేందుకుగానూ ఇలాంటి శిక్షణ ఇచ్చి నేపాల్ బోర్డర్ దాటిస్తుంటారని ఇంటెలిజెన్స్ వర్గాలు వివరించాయి.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ (ISI)తో సీమా హైదర్‌కు సంబంధాలు ఉండొచ్చనే అనుమానంతో ఆమెపై ఏటీఎస్, ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) నిఘా వేశాయి. కాగా సీమా హైదర్ పాకిస్తాన్ నుంచి తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ సరిహద్దు నుంచి బస్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించింది. 22 ఏళ్ల సచిన్ మీనా అనే తన ప్రియుడి కోసం భారత్ వచ్చానని ఆమె చెబుతోన్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-07-19T17:35:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising