Indigo:మద్యం తాగి.. విమానంలో ప్రయాణికులతో అసభ్య ప్రవర్తన.. తరువాత ఏమైందంటే ?
ABN, First Publish Date - 2023-11-20T14:42:37+05:30
Bengaluru: మద్యం తాగి విమానంలో ప్రయాణించడమే తప్పు.. ఆపై ప్రయాణికులతో గొడవ పడితే ఎలా ఉంటుంది? ఇలాంటి ఘటనే ఇండిగో(Indigo) విమానంలో జరిగింది. విమాన సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ లోని జైపుర్ నుంచి బెంగళూరుకు ప్రయాణించే విమానంలో 32 ఏళ్ల ఓ వ్యక్తి మద్యం తాగి ఎక్కాడు.
బెంగళూరు: మద్యం తాగి విమానంలో ప్రయాణించడమే తప్పు.. ఆపై ప్రయాణికులతో గొడవ పడితే ఎలా ఉంటుంది? ఇలాంటి ఘటనే ఇండిగో(Indigo) విమానంలో జరిగింది. విమాన సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ లోని జైపుర్ నుంచి బెంగళూరుకు ప్రయాణించే విమానంలో 32 ఏళ్ల ఓ వ్యక్తి మద్యం తాగి ఎక్కాడు. మద్యం మత్తులో తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రయాణికులు హెచ్చరించినా ప్రవర్తన మారకపోవడంతో విమాన సిబ్బందికి సమాచారం అందించారు. కెంపెగౌడ(Kempegouda International Airport) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగాక అతన్ని పోలీసులకు అప్పగించారు.
వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని.. అయితే కోర్టు నుంచి బెయిల్ పై విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు.
విమానం 6E 556లో ఉన్న ప్రయాణికుడు మద్యం మత్తులో ఉన్నాడని, పలుమార్లు హెచ్చరించినప్పటికీ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. అయితే విమానాల్లో తరచూ ఈ తరహా ఘటనలు జరుగుతుండటం పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులను సరిగ్గా ఎందుకు చెక్కింగ్ చేయట్లేదని ప్రశ్నిస్తున్నారు.
Updated Date - 2023-11-20T14:42:38+05:30 IST