ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Modi: నమో భారత్ ట్రైన్‌‌ ప్రారంభం.. రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2023-10-20T15:44:20+05:30

ఢిల్లీ-ఘాజియాబాద్-మీరట్ ల మధ్య రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(RRTS) కారిడార్‌ను ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ ప్రారంభించారు. నమో భారత్(Namo Barath) అని ఈ ట్రైన్ కి నామకరణం చేశారు.

ఢిల్లీ: ఢిల్లీ-ఘాజియాబాద్-మీరట్ ల మధ్య రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(RRTS) కారిడార్‌ను ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ ప్రారంభించారు. నమో భారత్(Namo Barath) అని ఈ ట్రైన్ కి నామకరణం చేశారు. ప్రస్తుతం ఇది 17 కి.మీ.ల మేర సేవలు అందించనుండగా... రేపు ఇది అందుబాటులోకి వస్తుంది. దీన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ట్రైన్ లో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ట్రైన్ ఇవాళ సహీబాబాద్ నుంచి దుహాయి మధ్య నడిచింది. ప్రధానితోపాటు కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్ పురి(Hardeep Singh Puri), యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌(Yogi Adityanath) ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ ట్రైన్ లో కనీస టికెట్టు ధర రూ.20 ఉండగా, గరిష్ఠంగా రూ.100 ఉండనుంది. ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆర్ఆర్టీఎస్ కారిడార్ నిర్మాణానికి ముందడుగు పడింది. ఢిల్లీ - మీరట్ కారిడర్ 2025వ సంవత్సరంలో పూర్తయ్యే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30 వేల కోట్లు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) ఆర్ఆర్టీఎస్ రైళ్లకు ర్యాపిడ్ ఎక్స్ (RAPIDX) అని పేరు పెట్టింది. ఈ ట్రైన్ గంటకు 180 కి.మీ.ల వేగంతో ప్రయాణిస్తుంది.


RRTS రైళ్లను 'నమో భారత్'గా పిలుస్తామని కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి మంత్రి హర్దీప్ సింగ్ పూరి గతంలోనే ప్రకటించారు. ఇది అందుబాటులోకి వస్తే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మరో హై స్పీడ్ ట్రైన్ భారత రైల్వే చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌కు ప్రధాని మోదీ మార్చి 8, 2019న శంకుస్థాపన చేశారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెంచడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని అధికారులు చెప్పారు. ఇండియాలో ఇప్పటికే వందే భారత్ రూపంలో ప్రభుత్వం సెమీ హై స్పీడ్ రైళ్లను నడుపుతోంది.

Updated Date - 2023-10-20T15:44:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising