PM Modi : సృజనాత్మకతకు పెద్దపీట వేయండి!
ABN, First Publish Date - 2023-08-19T03:50:55+05:30
ప్రజా ప్రయోజనం, వారి ఆరోగ్య భద్రతే లక్ష్యంగా సృజనాత్మక రంగానికి పెద్దపీట వేయాలని, సాంకేతికతను అందరూ సమానంగా అందిపుచ్చుకునేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ జీ-20 దేశాలకు పిలుపునిచ్చారు.
ప్రజాప్రయోజనం లక్ష్యంగా పనిచేయండి
జీ-20 సదస్సులో ప్రధాని మోదీ పిలుపు
గాంధీనగర్, న్యూఢిల్లీ, ఆగస్టు 18: ప్రజా ప్రయోజనం, వారి ఆరోగ్య భద్రతే లక్ష్యంగా సృజనాత్మక రంగానికి పెద్దపీట వేయాలని, సాంకేతికతను అందరూ సమానంగా అందిపుచ్చుకునేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ జీ-20 దేశాలకు పిలుపునిచ్చారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో నిర్వహించిన జీ-20 ఆరోగ్య శాఖ మంత్రుల సమావేశంలో శుక్రవారం ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. భవిష్యత్తులో కరోనా తరహా రోగాలు సంభవిస్తే ఆరో గ్య అత్యవసర పరిస్థితి ద్వారా వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, ఆర్థిక రంగంలో ఎవరూ ఊహించని నూతన శకం దిశగా భారత్ దూసుకుపోతోందని ప్రధాని మోదీ ‘లింక్డ్‌ఇన్’లో పేర్కొన్నారు. సమాన, సామూహిక శ్రేయస్సు లక్ష్యంగా 2047 నాటికి అభివృద్ధి చెందడం ఖాయమని తెలిపారు.
గ్రామాల్లో అభివృద్ధి దీపం వెలగాలి!
గ్రామాలు, తహసీల్, జిల్లాల స్థాయిలో అభివృద్ధి దీపం వెలగాలని, అప్పుడే 2047నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ‘వికసిత్ భారత్’ సాకారమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి చెందిన జిల్లా పంచాయతీ పరిషత్ సభ్యులతో వర్చువల్‌గా నిర్వహించిన ‘క్షేత్రీయ పంచాయతీరాజ్ పరిషద్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివి ధ అభివృద్ధి కార్యక్రమాలను సామూహిక ఉద్యమం గా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
Updated Date - 2023-08-19T03:50:55+05:30 IST