ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRICS : బ్రిక్స్ సదస్సు ఫొటో సెషన్‌లో నేలపై జాతీయ పతాకం.. మోదీ ఏం చేశారంటే..

ABN, First Publish Date - 2023-08-23T16:04:32+05:30

జాతీయ పతాకం ప్రతి పౌరునికీ గర్వకారణం. దేశ జెండాను చూస్తే మనసంతా ఉత్తేజం నిండుతుంది. అలాంటి స్ఫూర్తిదాయకమైన మువ్వన్నెల జెండాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఎల్లప్పుడూ ఎంతో గౌరవం ఇస్తారు.

Narendra Modi, Cyril Ramaphosa

జొహెన్నెస్‌బర్గ్ : జాతీయ పతాకం ప్రతి పౌరునికీ గర్వకారణం. దేశ జెండాను చూస్తే మనసంతా ఉత్తేజం నిండుతుంది. అలాంటి స్ఫూర్తిదాయకమైన మువ్వన్నెల జెండాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఎల్లప్పుడూ ఎంతో గౌరవం ఇస్తారు. ఆ విషయం బ్రిక్స్ సదస్సు (BRICS summit) ఫొటో సెషన్‌లో బుధవారం మరోసారి రుజువైంది.

బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న నేతలు గ్రూప్ ఫొటో దిగేందుకు వేదికపైకి వచ్చారు. నేతలు ఫొటో కోసం నిలబడవలసిన ప్రదేశాన్ని సూచించేందుకు ఆయా దేశాల జాతీయ జెండాలను నేలపై పెట్టారు. మోదీ వేదికను ఎక్కుతూ ఆ విషయాన్ని గమనించారు. మన జాతీయ జెండాను జాగ్రత్తగా తీసుకుని తన కోటు జేబులో పెట్టుకున్నారు. మన జాతీయ జెండాపై కాలు మోపకుండా, వంగి, దానిని తీసుకుని జేబులో పెట్టుకున్నారు. దీనిని గమనించిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా కూడా తన దేశపు జాతీయ జెండాను జాగ్రత్తగా తీసుకొని, మరొకరికి ఇచ్చారు.

బ్రిక్స్ దేశాల మధ్య ఐకమత్యం, సహకారం పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్థికాభివృద్ధి, ప్రపంచ సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నట్లు భారత దేశం స్పష్టం చేసింది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు భారత దేశం పరుగులు తీస్తోందని మోదీ చెప్పారు.

BRICSలో బ్రెజిల్, రష్యా, భారత దేశం, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయి.


ఇవి కూడా చదవండి :

Chandrayaan-3 : చంద్రునిపై భారత్ జయకేతనం ఎగురవేయాలంటూ కోట్లాది మంది పూజలు

Chandrayaan-3 : గతంలో ఇస్రోను ఎగతాళి చేసిన పాకిస్థానీ నేత, ఇప్పుడు ఏమంటున్నారంటే..

Updated Date - 2023-08-23T16:04:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising