PM Modi:'కాంగ్రెస్ కేరాఫ్ విధ్వంసం'.. మధ్యప్రదేశ్‌లో మోదీ మండిపాటు
ABN, First Publish Date - 2023-11-09T15:02:07+05:30
మధ్యప్రదేశ్(Madyapradesh)లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన చాలా రోజులపాటు విధ్వంసకర పాలన సాగిందని ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) విమర్శించారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నందునా బీజేపీ(BJP) నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు.
భోపాల్: మధ్యప్రదేశ్(Madyapradesh)లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన చాలా రోజులపాటు విధ్వంసకర పాలన సాగిందని ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) విమర్శించారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నందునా బీజేపీ(BJP) నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. "మధ్యప్రదేశ్ అభివృద్ధికి కాంగ్రెస్(Congress) వద్ద రోడ్ మ్యాప్ లేదు. మోదీ హామీలపై ప్రజలకు విశ్వాసం ఉంది. రాష్ట్ర యువత కాంగ్రెస్ ను విశ్వసించడం లేదు. మోదీ ఇచ్చిన హామీలపై వారికి నమ్మకం ఉంది. ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం. మీ ఒక్క ఓటు శత్రువులను భయపెట్టేలా చేస్తుంది. ఢిల్లీలో మోదీని బలపరుస్తుంది. అవినీతి చేస్తున్న కాంగ్రెస్ ని శాశ్వతంగా తరిమికొడుతుంది. కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఉచిత రేషన్, ఉచిత వైద్యం ఆగిపోతాయి.
అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, రాష్ట్రంలోని బీజేపీ సర్కార్ కి పని చేయడానికి వీలు లేకుండా అడ్డంకులు సృష్టించింది. కాంగ్రెస్ రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టింది. బీజేపీ వచ్చాక చీకట్లో నుంచి రాష్ట్రాన్ని బయటకి తీసుకువచ్చాం. ఇప్పుడు దళితులు, గిరిజనులు,. పేదలందరి సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నాం. 10 ఏళ్లలో ప్రజల కోసం 4 కోట్ల ఇళ్లు నిర్మించాం. అదే సంకల్పంతో అయోధ్య రామమందిరాన్ని నిర్మిస్తున్నాం. ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు కట్టిస్తాం. కాంగ్రెస్ హయాంలో దోచుకున్న డబ్బంతా ఎటు పోయింది? బీజేపీ అధికారంలోకి వచ్చాక స్కాంలన్నీ ఆపాను. 10 ఏళ్లలో 10 లక్షల పేదల అకౌంట్లకు డబ్బులు పంపాం. ఉచిత రేషన్(Free Ration) పథకాన్ని మరో ఐదేళ్లు పొడగించనున్నాం. సాత్నా జిల్లాలో 4 లక్షల మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు" అని ప్రధాని అన్నారు. మధ్యప్రదేశ్ లో నవంబర్ 17న ఒకే దశలో ఎన్నికలు(Madyapradesh Elections) జరుగుతాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Updated Date - 2023-11-09T15:02:08+05:30 IST