ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Modi US visit: న్యూయార్క్ నగరంలో ప్రధాని మోదీ యోగా.. గిన్నీస్ రికార్డ్

ABN, First Publish Date - 2023-06-21T20:38:20+05:30

అగ్రరాజ్యం అమెరికాలో పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi US Visit) రెండో రోజు కార్యక్రమాలను మొదలుపెట్టారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం (nternational Yoga Day) సందర్భంగా ఐక్యరాజ్యసమితి (UNO) భవనం ఆవరణలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అత్యధిక దేశాలకు చెందిన పౌరులు పాల్గొన్న యోగా కార్యక్రమంగా ఈ ఈవెంట్ రికార్డును దక్కించుకుంది. ఈ మేరకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi US Visit) రెండో రోజు కార్యక్రమాలను మొదలుపెట్టారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం (nternational Yoga Day) సందర్భంగా ఐక్యరాజ్యసమితి (UNO) భవనం ఆవరణలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దౌత్యవేత్తలు, పలువురు ప్రముఖులతో కలిసి ఈ ఈవెంట్‌లో భాగస్వాములయ్యారు. యోగా నిజంగా విశ్వవ్యాప్తమని ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. యూఎన్‌వో ప్రధాన కార్యాలయ ఆవరణ ఉత్తరభాగంలో భారత్‌లో తయారైన యోగా మ్యాట్‌లపై యోగా చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రధాని మోదీ ఆగి మరీ నమస్కరించారు.

యోగా అన్ని వయసుల వారిదని, అన్ని విశ్వాసాలు, సంస్కృతులకు చెందినవారు పాటించవచ్చునని మోదీ సూచించారు. యోగాను ఎక్కడైనా అభ్యసించొచ్చని చెప్పారు. యోగా చేసినప్పుడు శారీరకంగా దృఢంగా, మానసికంగా ప్రశాంతత లభిస్తాయన్నారు. మానసికంగా సంతృప్తి చెందుతామని సూచించారు. కేవలం చాప మీద వ్యాయామం చేయడంగా భావించొద్దని అన్నారు. యోగా అనేది ఒక జీవన విధానమని గుర్తించాలన్నారు. ‘‘ యోగాకు కాపీరైట్స్, పేటెంట్, రాయల్టీలు ఉండవు. యోగా ఉచితం. ఒంటరిగా లేదా సమూహంగా, టీచర్ నుంచి నేర్చుకోవచ్చు లేదా స్వయంగానైనా చేసుకోవచ్చు. యోగా విశ్వజనీనమైనది. అన్ని ఆచార, సంస్కృతులకు చెందినది’’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈ కార్యక్రమం తర్వాత ఆయన వాషింగ్టన్ బయలుదేరారు.

గిన్నీస్ వరల్డ్ రికార్డ్...

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన యోగా కార్యక్రమంలో గిన్నీస్ బుక్ రికార్డును సొంతం చేసుకుంది. అత్యధిక దేశాలకు చెందిన పౌరులు పాల్గొన్న యోగా కార్యక్రమంగా ఈ ఈవెంట్ రికార్డును దక్కించుకుంది. ఈ మేరకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు తెలిపారు. కాగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-06-21T20:44:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising