ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hamas vs Israel: ఇజ్రాయెల్ ప్రధానితో ఫోన్‌లో మాట్లాడిన మోదీ.. అండగా ఉంటామంటూ ధైర్యం చెప్పిన ప్రధాని

ABN, First Publish Date - 2023-10-10T16:45:22+05:30

ఇజ్రాయెల్‌పై హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) చేసిన మెరుపుదాడిని ప్రధాని మోదీ ఇదివరకే ఖండించిన విషయం తెలిసిందే. హమాస్ దాడి చేసిందన్న విషయం తెలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ట్విటర్ మాధ్యమంగా..

ఇజ్రాయెల్‌పై హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) చేసిన మెరుపుదాడిని ప్రధాని మోదీ ఇదివరకే ఖండించిన విషయం తెలిసిందే. హమాస్ దాడి చేసిందన్న విషయం తెలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ట్విటర్ మాధ్యమంగా ఈ దాడిపై స్పందించారు. ఈ దాడి తనని బాధించిందని, ఈ క్లిష్ట సమయంలో తాము ఇజ్రాయెల్‌కి అండగా ఉంటామని తెలిపారు. ఇందుకు ఇజ్రాయెల్ మంత్రి కృతజ్ఞతలు కూడా తెలిపారు. తాజాగా ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు.

నెతన్యాహు మంగళవారం తనకు ఫోన్ చేశారని.. హమాస్‌తో జరుగుతున్న యుద్ధం గురించి తనతో చర్చించారని ప్రధాని మోదీ తెలిపారు. ఇజ్రాయెల్‌కు భారత్ అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని నెతన్యాహుకు తాను హామీ ఇచ్చానని అన్నారు. ఉగ్రవాదాన్ని అన్ని రకాలుగానూ భారతదేశం తీవ్రంగా ఖండిస్తుందని మోదీ నొక్కి చెప్పారు. ‘‘తనకు ఫోన్ చేసి, ప్రస్తుతం హమాస్‌తో కొనసాగుతున్న ఘర్షణపై అప్డేట్ అందించినందుకు ప్రధానమంత్రి నెతన్యాహుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో భారతదేశ ప్రజలు ఇజ్రాయెల్‌కి అండగా నిలబడతారు. అన్ని విధాలుగానూ భారతదేశం ఉగ్రవాదాన్ని నిస్సందేహంగా ఖండిస్తుంది’’ అంటూ ప్రధాని మోదీ ట్విటర్ (X ప్లాట్‌ఫామ్) మాధ్యమంగా రాసుకొచ్చారు.


అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు ఇజ్రాయెల్‌కు తమ మద్దతు తెలియజేస్తూ, హమాస్ ఉగ్రవాద చర్యల్ని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో.. ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ నుంచి ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఇజ్రాయెల్‌తో పాటు పాలస్తీనాకు భారత్ మిత్రదేశమని.. ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడంలో సహాయం చేయడానికి తప్పనిసరిగా ముందుకు రావాలని భారత్‌లోని పాలస్తీనా రాయబారి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. మోదీ, నెతన్యాహు మధ్య జరిగిన ఈ సంబాషణకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. పాలస్తీనా విషయంలో భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మహాస్ దాడిని వ్యతిరేకిస్తూ.. ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది.

ఇదిలావుండగా.. శనివారం ఉదయం భూమి, జల, వాయు మార్గాల ద్వారా హమాస్ ఒక్కసారిగా దాడి చేయడంతో ఇజ్రాయెల్ సైన్యం ఖంగుతింది. హమాస్ ఈ తరహా దాడులు చేస్తుందని ఆ దేశం ఊహించలేకపోయింది. అయితే.. ఆ వెంటనే తేరుకొని ఇజ్రాయెల్ తిరిగి ఎదురుదాడులకు దిగింది. ఇప్పటికే హమాస్ ఉగ్రవాదులు ఆక్రమించిన కొంత భూబాగాల్ని తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. అంతేకాదు.. హమాస్‌కు ఇదే ఆఖరి యుద్ధం చేయాలన్న ఉద్దేశంతో గాజాపై అన్ని విధాలుగా ఆంక్షలు విధించింది. విద్యుత్, ఆహారం, ఇంధన సరఫరాల్ని నిషేధించింది. లక్ష మంది సైన్యాన్ని రంగంలోకి దింపి.. గాజాని ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది.

Updated Date - 2023-10-10T16:45:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising