ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3 : సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజు జూలై 14 : మోదీ

ABN, First Publish Date - 2023-07-14T12:23:52+05:30

చంద్రుడి గురించి తెలుసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేస్తున్న ప్రయత్నాల్లో మూడోదైన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం మరికాసేపట్లో జరగబోతోంది. యావత్తు ప్రపంచం దీనిని ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తోంది.

Narendra Modi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : చంద్రుడి గురించి తెలుసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేస్తున్న ప్రయత్నాల్లో మూడోదైన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం మరికాసేపట్లో జరగబోతోంది. యావత్తు ప్రపంచం దీనిని ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఇటువంటి ఉద్విగ్న, భావోద్వేగ క్షణాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఓ ట్వీట్ చేశారు.

భారత అంతరిక్ష పరిశోధన రంగంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే రోజు 2023 జూలై 14 అని తెలిపారు. మన మూడో లూనార్ మిషన్ చంద్రయాన్-3 తన ప్రయాణాన్ని ప్రారంభించే రోజు ఇది అని వివరించారు. ఈ ప్రధానమైన మిషన్ మన దేశ ఆశలు, స్వప్నాలను మోసుకెళ్తుందని తెలిపారు.

కేంద్ర విద్యా శాఖ మత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన ట్వీట్‌లో, ఇస్రోను కరతాళ ధ్వనులు, కేరింతలతో ప్రోత్సహించే 140 కోట్ల మంది భారతీయుల్లో తానూ ఉన్నానని చెప్పారు. త్వరలోనే చంద్రునిపైన కలుద్దామని తెలిపారు.

చంద్రయాన్ ఎప్పుడెప్పుడు జరిగింది :

2003 ఆగస్టు 15 : అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయి చంద్రయాన్ ప్రోగ్రామ్‌ను ప్రకటించారు.

2008 అక్టోబరు 22 : చంద్రయాన్-1 ఆంధ్ర ప్రదేశ్‌లోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బయల్దేరింది.

2008 నవంబరు 8 : చంద్రయాన్-1 లూనార్ ట్రాన్స్‌ఫర్ ట్రాజెక్టరీలో ప్రవేశించింది.

2008 నవంబరు 14 : చంద్రుని దక్షిణ ధ్రువంలో, ఉపరితలంలో నీటి అణువులు ఉన్నాయని ధ్రువీకరించింది.

2009 ఆగస్టు 28 : చంద్రయాన్-1 ప్రోగ్రామ్ ముగిసింది.

2019 జూలై 22 : శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-2 ప్రయోగం జరిగింది.

2019 ఆగస్టు 20 : చంద్రయాన్-2 వ్యోమనౌకను చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

2019 సెప్టెంబరు 2 : 100 కిలోమీటర్ల లూనార్ పోలార్ ఆర్బిట్‌లో చంద్రుని చుట్టూ తిరుగుతూ విక్రమ్ ల్యాండర్ వేరుపడింది. అయితే ఈ ల్యాండర్ నుంచి భూమిపైగల స్టేషన్లకు కమ్యూనికేషన్ సదుపాయాన్ని కోల్పోయింది.

2023 జూలై 14 : శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి చంద్రయాన్-3 వ్యోమనౌకను ప్రయోగించబోతున్నారు.

2023 ఆగస్టు 23/24 : చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపై 2023 ఆగస్టు 23/24 తేదీల్లో సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈ విజయాన్ని సాధించిన నాలుగో దేశంగా భారత దేశం ఘనత సాధిస్తుంది. గతంలో అమెరికా, చైనా, సోవియెట్ యూనియన్ ఈ ఘనత సాధించాయి. అయితే చంద్రునిపై నీటి జాడ ఉందని కనుగొన్నది భారత దేశమే.

ఇవి కూడా చదవండి :

Modi France Visit : ఫ్రాన్స్‌లో భారతీయ కరెన్సీలో యూపీఐ చెల్లింపులు.. పోస్ట్ స్టడీ వర్క్ వీసాలు.. : మోదీ

Kosovo Parliament : కొసావో పార్లమెంటులో కొట్లాట.. పిడిగుద్దులతో తలపడిన ఆడ, మగ సభ్యులు..

Updated Date - 2023-07-14T12:23:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising