ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ChatGPT : ప్రజలను సాధికారులను చేయడానికి అందరి సహకారాన్ని స్వాగతిస్తాం : మోదీ

ABN, First Publish Date - 2023-06-09T13:14:46+05:30

భారత దేశ టెక్ ఎకోసిస్టమ్‌ను విస్తరించడంలో కృత్రిమ మేధాశక్తి (AI)కిగల సామర్థ్యం చాలా విస్తృతమైనదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

Sam Altman, Narendra Modi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత దేశ టెక్ ఎకోసిస్టమ్‌ను విస్తరించడంలో కృత్రిమ మేధాశక్తి (AI)కిగల సామర్థ్యం చాలా విస్తృతమైనదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narender Modi) చెప్పారు. ముఖ్యంగా యువతకు ఆ సత్తా ఉందన్నారు. దేశ ప్రజలను సాధికారులుగా చేయడం కోసం డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను వేగవంతం చేయడానికి అందరి సహకారాన్ని స్వాగతిస్తామని తెలిపారు. ఓపెన్ఏఐ (OpenAI) సీఈఓ, చాట్‌జీపీటీ సృష్టికర్త శాం ఆల్ట్‌మాన్ (Sam Altman)తో గురువారం సమావేశమైన తర్వాత మోదీ ఇచ్చిన ఓ ట్వీట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

కృత్రిమ మేధాశక్తి టెక్నాలజీస్‌ కంపెనీ ఓపెన్ఏఐ సృష్టించిన చాట్‌జీపీటీ (ChatGPT) పట్ల అందరిలోనూ ఆసక్తి పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ ట్రిపుల్ ఐటీలో జరిగిన డిజిటల్ ఇండియా డయలాగ్స్ కార్యక్రమంలో శాం ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ, మోదీతో సమావేశం ఆహ్లాదకరంగా జరిగిందని చెప్పారు. కృత్రిమ మేధాశక్తి పట్ల మోదీ చాలా ఉత్సాహం ప్రదర్శించారని, ఆలోచనాత్మకంగా మాట్లాడారని తెలిపారు. చాట్‌జీపీటీ గురించి మాట్లాడుతూ, దీనిని విడుదల చేయడానికి ముందు ఎనిమిది నెలలపాటు క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పారు. ఇది సురక్షితమైనదా? కాదా? అనే అంశాన్ని తరచి తరచి పరీక్షించామని చెప్పారు. సమన్వయం చాలా ముఖ్యమని, స్వీయ నియంత్రణ చాలా చాలా ముఖ్యమని తాము భావిస్తున్నామని తెలిపారు. తాను భారత దేశంలో కొన్ని స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులతో మాట్లాడానని చెప్పారు. భారతీయ స్టార్టప్ కంపెనీల నాణ్యతను ప్రశంసించారు. భారత దేశంలో తాను చేసే మొదటి పని స్టార్టప్ కంపెనీలకు నిధులను సమకూర్చడమని చెప్పారు. భారత దేశంలో ఐటీ ఇండస్ట్రీ చాలా పటిష్టంగా ఉందని, డేటా విస్తారంగా ఉందని చెప్పారు. ఏఐ-బేస్డ్ యుటిలిటీస్ ఈ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. ఏఐ ప్రస్తుతం ప్రారంభ దశలో ఉందన్నారు.

ఓపెన్ఏఐ కంపెనీ ‘చాట్‌జీపీటీ’ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ . దీనిని భారత దేశం చాలా ఆత్రుతగా, త్వరగా ఎందుకు స్వీకరించిందని అడిగినపుడు మోదీ చాలా ఆలోచనాత్మకంగా, ఉత్సాహంగా మాట్లాడారని, అద్భుతమైన సమాధానాలు చెప్పారని, ఈ సమావేశం చాలా అద్భుతంగా జరిగిందని శాం చెప్పారు. వివిధ సేవలలో కృత్రిమ మేధాశక్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయాలని శాం చెప్పారు. ప్రభుత్వ సేవలను విస్తరించేందుకు లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్స్‌ను వినియోగించుకోవాలని తెలిపారు.

మోదీతో సమావేశమైనప్పటి ఫొటోను శాం ఆల్ట్‌మాన్ ట్వీట్ చేశారు. భారత దేశంలోని అద్భుతమైన టెక్నాలజీ వాతావరణం గురించి చక్కని చర్చ జరిగిందని చెప్పారు. కృత్రిమ మేధాశక్తి వల్ల భారత దేశం ఏ విధంగా లబ్ధి పొందగలదో చర్చించామన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం అధికారులతో సమావేశాలన్నీ సంతృప్తికరంగా జరిగాయని తెలిపారు.

శాం ఆల్ట‌్‌మాన్ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, కృత్రిమ మేధాశక్తి గురించి సమగ్రంగా, లోతుగా చర్చించినందుకు శాం ఆల్ట్‌మాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారత దేశ టెక్ ఎకోసిస్టమ్‌ను విస్తరించడంలో కృత్రిమ మేధాశక్తి (AI)కిగల సామర్థ్యం చాలా విస్తృతమైనదని, ముఖ్యంగా యువతకు ఆ సత్తా ఉందని అన్నారు. దేశ ప్రజలను సాధికారులుగా చేయడం కోసం డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను వేగవంతం చేయడానికి అందరి సహకారాన్ని స్వాగతిస్తామని తెలిపారు.

ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరం

NASSCOM డేటాను ఉటంకిస్తూ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మన దేశంలో కృత్రిమ మేధాశక్తి ద్వారా 4,16,000 మంది ప్రొఫెషనల్స్‌కు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ రంగం 20 నుంచి 25 శాతం మేరకు వృద్ధి చెందుతుంది. 2035నాటికి ఈ రంగం ద్వారా అదనంగా 957 బిలియన్ డాలర్లు మన దేశ ఆర్థిక వ్యవస్థకు సమకూరుతుంది.

ఉద్యోగాలు పోతాయేమో?

మరోవైపు ఏఐ (Artificial Intelligence-కృత్రిమ మేధాశక్తి) వల్ల ఉద్యోగాలను కోల్పోతామనే భయం ప్రజలను వెంటాడుతోంది. అయినప్పటికీ ఏఐ వల్ల మానవుల అవసరం తగ్గుతుందని , ప్రజలకు సేవలను మరింత మెరుగ్గా అందజేయడం కోసం ఏఐని ఉపయోగించుకోవాలని చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

America : డొనాల్డ్ ట్రంప్‌పై ఏడు ఆరోపణలతో కేసు నమోదు

Nirmala Sitharaman : కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కుమార్తె వివాహం అత్యంత నిరాడంబరంగా!

Updated Date - 2023-06-09T13:14:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising