PM Modi: 6 రోజులు.. 8 ర్యాలీలు.. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన
ABN, First Publish Date - 2023-09-30T12:54:49+05:30
ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi) ఆరు రోజుల పాటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్(Madyapradesh), రాజస్థాన్(Rajasthan), తెలంగాణ(Telangana), ఛత్తీస్‌గఢ్(Chattisgarh)లలో మెగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi) ఆరు రోజుల పాటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్(Madyapradesh), రాజస్థాన్(Rajasthan), తెలంగాణ(Telangana), ఛత్తీస్‌గఢ్(Chattisgarh)లలో మెగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. శనివారం నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 6 వరకు ఆయా రాష్ట్రాల్లో ఎనిమిది ర్యాలీలు నిర్వహిస్తారు. పర్యటనలో భాగంగా ఆయన వివిధ ప్రాజెక్టులు, ప్రజా సంక్షేమ పథకాలను కూడా ప్రారంభించనున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో...
భారతీయ జనతా పార్టీ(BJP)కి చెందిన రెండు 'పరివర్తన్ యాత్రల' ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సైన్స్ కళాశాల మైదానంలో జరిగే 'పరివర్తన్ మహాసంకల్ప' ర్యాలీలో ఆయన ప్రసంగిస్తారని రాష్ట్ర బీజేపీ చీఫ్ అరుణ్ సావో తెలిపారు. అక్టోబరు 3న బస్తర్‌లోని జగదల్పూర్లో బహిరంగ సభలకు హాజరవనున్నారు.
తెలంగాణలో...
అక్టోబర్ 1న, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్న మోదీ, అక్కడ రూ.13 వేల 500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ మార్గాల్లో రైలు సర్వీసులను, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని ఐదు కొత్త భవనాలను కూడా ప్రారంభిస్తారు. అక్టోబరు 3న నిజామాబాద్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.
మధ్యప్రదేశ్‌లో...
అక్టోబర్ 2న, మోడీ మధ్యప్రదేశ్‌లో ఒక రోజు పర్యటించనున్నారు, అక్కడ గ్వాలియర్‌లో రెండు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అక్టోబర్ 6న జోధ్‌పూర్‌ను సందర్శిస్తారు. అనంతరం జబల్పూర్, జగదల్పూర్లలో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
రాజస్థాన్‌లో...
అక్టోబర్ 2న కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. చిత్తోర్‌గఢ్‌లో భారీ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు.
Updated Date - 2023-09-30T12:54:49+05:30 IST