ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Narendra Modi: ఆసుపత్రి ఘటనపై ప్రధాని మోదీ విచారం.. కారకులకు శిక్ష పడాల్సిందే!

ABN, First Publish Date - 2023-10-18T16:48:02+05:30

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. గాజాలోని ఓ ఆసుపత్రిపై బాంబు దాడి జరిగింది. ఈ దాడి చేసింది ఎవరనేది కచ్ఛితమైన సమాచారం లేదు కానీ.. ఇజ్రాయెల్, హమాస్ మాత్రం పరస్పర ఆరోపణలు...

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. గాజాలోని ఓ ఆసుపత్రిపై బాంబు దాడి జరిగింది. ఈ దాడి చేసింది ఎవరనేది కచ్ఛితమైన సమాచారం లేదు కానీ.. ఇజ్రాయెల్, హమాస్ మాత్రం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని హమాస్ ఆరోపిస్తుంటే.. ఆ దేశం మాత్రం ఆ ఆరోపణల్ని ఖండిస్తోంది. ఏదేమైనా.. ఈ దాడిలో బలి అయ్యింది మాత్రం ఆ ఆసుపత్రిలో ఉన్న సామాన్యులు. ఈ నేపథ్యంలోనే.. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చిపడుతున్నాయి.

ఇప్పుడు తాజాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అలాగే.. ఈ దాడికి పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందేనని కోరారు. ‘‘గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిలో ప్రాణనష్టం సంభవించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అలాగే.. ఈ దాడిలో గాయపడిన వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత తీవ్రమైన, ఆందోళన కలిగించే విషయం. ఈ దాడికి కారకులైన వారికి శిక్ష పడాలి’’ అని ట్విటర్ మాధ్యమంగా మోదీ విచారం వ్యక్తం చేశారు.


ఇదిలావుండగా.. మంగళవారం అల్ అహ్లీ ఆసుపత్రిలో పేలుడు సంభవించగా, ఇందులో 500 మంది మరణించినట్లు సమాచారం. ఇంకా వందలాది మంది తీవ్ర గాయాలపాలయ్యారని తెలిసింది. ఈ ఘటనకు ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని హమాస్ ఆరోపిస్తుంటే.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మాత్రం ఆ ఆరోపణలను ఖండించాయి. పాలస్తీనా ఇస్లామిక్ ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్ గురి తప్పి.. ఆ ఆసుపత్రిపై పడిందని ఐడీఎఫ్ పేర్కొంటోంది. ఇలా వీళ్లిద్దరు ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటుంటే.. ప్రపంచ దేశాలు మాత్రం ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న యుద్ధంలో పౌరులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరమైన విషయమని ఆయా దేశాల అధినేతలు, ఇతర మంత్రులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. అక్టోబర్ 7వ తేదీన 5వేలకు పైగా రాకెట్లతో హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. భూమి, వాయు, జల మార్గాల ద్వారా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి.. సైనికులతో పాటు పౌరుల్ని సైతం హతమార్చారు. వందలాది మంది ఇజ్రాయెల్ పౌరుల్ని అపహరించుకుపోయారు. దీంతో.. ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగింది. హమాస్‌ని తుడిచిపెట్టేయాలన్న ఉద్దేశంతో దూసుకుపోతోంది. గాజాపై ఆంక్షలు విధించిన ఇజ్రాయెల్.. వైమానిక దళాల చేత బాంబుల వర్షం కురిపిస్తోంది. గ్రౌండ్ ఆపరేషన్స్‌కి కూడా నిర్వహిస్తోంది. అటు.. ఈ యుద్ధంలో భారత్ ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపింది. అమెరికాతో పాటు పలు దేశాలు సైతం ఇజ్రాయెల్‌కు అండగా నిలిచాయి.

Updated Date - 2023-10-18T16:48:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising