Shraddha Walker Case: అఫ్తాబ్‌పై 6,629 పేజీల చార్జిషీటు, హత్యకు కారణం చెప్పిన సీపీ
ABN, First Publish Date - 2023-01-24T19:05:05+05:30
శ్రద్ధా వాకర్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు 6,629 పేజీల ఛార్జిషీటును..
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసు (Shraddha Walkar Murder Case)ను దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు 6,629 పేజీల ఛార్జిషీటు (Chargesheet)ను సాకేత్ కోర్టులో మంగళవారంనాడు దాఖలు చేశారు. శ్రద్ధావాకర్‌తో సహజీవనం సాగించిన అఫ్తాబ్ పూనావాలా (Aaftab poonawala) ఆమెను హత్య చేసి 35 ముక్కలుగా నరికి ఢిల్లీ శివార్లలోని పలు ప్రాంతాల్లో విసిరివేసిన సంఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పోలీసు వర్గాల సమచారం ప్రకారం, 100 పేజీల సాక్షుల వాంగ్మూలం, ఫోరెన్సిక్, ఎలక్ర్టానిక్ ఆధారాలతో 3,000 పేజీల ముసాయిదా ఛార్జిషీటును రూపొందించింది. ప్రస్తుతం దానిని నిపుణులు సమీక్షిస్తున్నారు. ''ఈ కేసుకు సబంధించి సుమారు 6,000 పేజీలతో మంగళవారం ఛార్జిషీటు దాఖలు చేశాం. 150కి మందికి పైగా సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డు చేశాం'' అని సదరన్ రేంజ్ జాయిట్ సీపీ మీను చౌదరి తెలిపారు.
ఫ్రెండ్‌ను కలిసిందనే చంపేశాడు...
కాగా, ఘటన జరిగిన రోజు బాధితురాలు (శ్రద్ధావాకర్) ఒక ఫ్రెండ్‌ను కలుసుకునేందుకు వెళ్లిందని, ఆ కారణంగానే హత్యా ఘాతుకానికి అఫ్తాబ్ ఒడిగట్టాడని మీను చౌదరి తెలిపారు.
కస్టడీ పొడిగింపు..
మరోవైపు, అఫ్తాబ్ పూనావాలా కస్టడీని కూడా కోర్టు పొడిగించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు అఫ్తాబ్‌ను హాజరు పరచగా, ఫిబ్రవరి 7వ తేదీ వరకూ కస్టడీని కోర్టు పొడిగించింది. ఆ రోజు కోర్టు ముందు అఫ్తాబ్‌ను నేరుగా హాజరుపరచాలని కూడా కోర్టు పోలీసులను ఆదేశించింది.
Updated Date - 2023-01-24T19:05:06+05:30 IST