ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Most Expensive Painting: అత్యంత ఖరీదైన పెయింటింగ్.. ప్రముఖ కంపెనీల సీఈవోల జీతాలు కూడా జూజూబీనే!

ABN, First Publish Date - 2023-12-13T18:07:24+05:30

2023 సంవత్సరం.. భారతీయ కళాకారులకు అత్యంత ఫలవంతమైనదిగా నిలిచింది. ఎందుకంటే.. ఈ ఏడాదిలో ఒక పెయింటింగ్ కనీవినీ ఎరుగని భారీ ధరకు అమ్ముడుకుపోయి, సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ పెయింటింగ్‌ని...

Most Expensive Painting: 2023 సంవత్సరం.. భారతీయ కళాకారులకు అత్యంత ఫలవంతమైనదిగా నిలిచింది. ఎందుకంటే.. ఈ ఏడాదిలో ఒక పెయింటింగ్ కనీవినీ ఎరుగని భారీ ధరకు అమ్ముడుకుపోయి, సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ పెయింటింగ్‌ని తనదైన చెరగని ముద్ర వేసిన ప్రముఖ పెయింటర్ అమృతా షేర్-గిల్ రూపొందించారు. ఈ పెయింటింగ్‌లో ఆమె.. ఒకరు గ్రామీణ భారతదేశంలోని మహిళల జీవితాన్ని కళ్లకు కట్టినట్టు ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు.

స్వాతంత్రానికి ముందు.. అంటే 1937లో ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో తాను గడిపిన సమయంలో ‘‘ది స్టోరీ టెల్లర్’’ పేరుతో అమృతా షేర్-గిల్ ఈ పెయింటింగ్ వేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వేలంపాటు నిర్వహించగా.. ఇది భారతీయ కళాకృతిలో మునుపెన్నడూ లేని స్థాయిలో భారీ ధర పలికింది. న్యూఢిల్లీలో ప్రత్యక్ష వేలంలో ఈ పెయింటింగ్ $7.4 మిలియన్ (భారతీయ కరెన్సీలో రూ.61.8 కోట్లు) ధరకు విక్రయించింది. మన భాతరదేశంలోని ప్రముఖ కంపెనీలకు చెందిన సీఈవోల వార్షిక వేతనం కన్నా అనేక రెట్లు.


ఈ పెయింటింగ్ వెనుక కథ

షేర్-గిల్ తండ్రి పంజాబ్‌కు చెందిన పండితుడు. ఆమె తల్లి ఒక ఒపెరా సింగర్. తండ్రి ఉమ్రావ్ సింగ్ షేర్-గిల్ భారతీయుడైతే.. ఆమె తల్లి హంగేరియన్ వంశానికి చిందింది. షేర్-గిల్‌కు చిన్నతనం నుంచి కళల పట్ల ఆసక్తి పెరిగింది. ఆమె ఫ్రాన్స్‌లోని పారిస్, ఇటలీలోని ఫ్లోరెన్స్ వంటి యూరోపియన్ నగరాల్లో శిక్షణ పొందింది. 1921లో భారతదేశానికి వచ్చిన ఆమె.. హిల్ సిటీ సిమ్లాలో నివసించింది.

యూపీలోని సరయాలో తన మామకు చెందిన ఎస్టేట్‌లో షేర్-గిల్ ఉన్నప్పుడు.. ఈ ‘స్టోరీ టెల్లర్’ పెయిటింగ్‌ని చిత్రీకరించారు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే స్త్రీల జీవితాన్ని గమనించి.. ఈ పెయింటింగ్ వేశారు. అయితే.. కళావృత్తిలో అత్యంత ప్రతిభావంతురాలైన షేర్-గిల్.. 28 ఏళ్ల వయసులోనే 1941లో మృతి చెందారు.

Updated Date - 2023-12-13T18:07:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising