ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Aditya L1 : నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ-57

ABN, First Publish Date - 2023-09-02T12:20:29+05:30

షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సరిగ్గా 11.50 గంటలకి పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్ ప్రయోగం జరిగింది. నిప్పులు చెరుగుతూ నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్ దూసుకెళ్లింది. 63 నిమిషాల పాటు 235 కి.మీ దూరం నింగిలోకి ప్రయాణించిన అనంతరం భూ స్థిర కక్ష్యలోకి ఆదిత్యా ఎల్-1 శాటిలైట్‌ని పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ప్రవేశపెట్టనుంది.

నెల్లూరు : షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సరిగ్గా 11.50 గంటలకి పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్ ప్రయోగం జరిగింది. నిప్పులు చెరుగుతూ నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్ దూసుకెళ్లింది. 63 నిమిషాల పాటు 235 కి.మీ దూరం నింగిలోకి ప్రయాణించిన అనంతరం భూ స్థిర కక్ష్యలోకి ఆదిత్యా ఎల్-1 శాటిలైట్‌ని పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ప్రవేశపెట్టనుంది. మిషన్ ఆదిత్య ప్రయోగానికి సుమారు రూ.378 కోట్లు ఇస్రో వెచ్చించింది. షార్‌లో తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. మిషన్ ఆదిత్య విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు గట్టి ధీమాతో ఉన్నారు. పీఎస్ఎల్‌వీ సీ-57 సైతం దిగ్విజయంగా నింగిలోకి దూసుకువెళుతోంది.

చంద్రయాన్‌-3 విజయవంతంతో దూకుడుమీదున్న ఇస్రో ఆదిత్య ఎల్‌-1 ప్రయోగాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా నేడు పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్‌ను ప్రయోగించింది. ఆదిత్య ఎల్‌-1 శాటిలైట్‌ను ఇస్రో లాగ్రాంజియన్‌ పాయింట్‌ -1లో కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నది. ఈ కక్ష్య భూమికి 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ కక్ష్యను చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పట్టనుంది. సూర్యుడిపై ప్రయోగాల నేపథ్యంలో ఇస్రో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. గతంలో కొన్ని దేశాలు సూర్యుడిపై ప్రయోగాలు చేపట్టాయి. అయితే ఆదిత్య ఎల్‌-1 మిషన్‌తో ఇస్రో ఎలాంటి పరిశోధనలు చేయనుందనేది ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2023-09-02T12:21:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising