ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul Gandhi: బిల్లు అమలుకు జనగణన, డీలిమిటేషన్ అడ్డుకాదు..!

ABN, First Publish Date - 2023-09-20T18:43:39+05:30

మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, అయితే, బిల్లులో ఓబీసీ కోటా అమలు చేయాలని తాము కోరుకుంటున్నామని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చలో ఆయన పాల్గొంటూ మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, అయితే, బిల్లులో ఓబీసీ (OBC) కోటా అమలు చేయాలని తాము కోరుకుంటున్నామని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చలో ఆయన పాల్గొంటూ మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. భారత ప్రభుత్వం (GOI)లోని సెక్రటరీల నియామకాల్లో ఓబీసీలను మోదీ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. జీఓఐలో 90 మంది సెక్రటరీలు ఉండగా, అందులో ఓబీసీలు ముగ్గురేనని, ఓబీసీ సెక్రటరీలు లేకపోవడం ఆ సామాజికవర్గాన్ని అమానించడమేనని, ఈ పరిస్థితిని ప్రభుత్వ మార్చాలని సూచించారు.


బిల్లును తక్షణం ఆమోదించి, అమలు చేయండి..

మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణం ఆమోదించి, అమలు చేయాలని కేంద్రాన్ని రాహుల్ కోరారు. నియోజకవర్గాల పునర్విభజన, జనగణనను ఆ తర్వాత చేపట్టవచ్చని, బిల్లు అమలు చేయడానికి వాటి అవసరం లేదని అన్నారు. కులగణన లెక్కలను (డాటా) బహిరంగం చేయాలని కేంద్రానికి సవాలు విసిరారు. ''మీరు (ప్రభుత్వం) ఆ గణాంకాలను బయటపెట్టండి. లేకుంటే ఆ పని కాంగ్రెస్ చేస్తుంది'' అని రాహుల్ స్పష్టం చేశారు.


దీనికి ముందు, లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పాల్గొంటూ, మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతిస్తున్నట్టు తెలిపారు. వెంటనే బిల్లును అమల్లోకి తీసుకురావాలని, లేదంటే మహిళలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. మహిళలు రాజకీయ బాధ్యతలు చేపట్టాలని గత 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. కోటాలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు సబ్‌ కోటా కల్పించాలని, చట్టం సమర్ధ అమలుకు తక్షణమే కులగణన చేపట్టాలని సోనియాగాంధీ కోరారు.

Updated Date - 2023-09-20T18:43:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising