Rahul Gandhi: జీ-20 అతిథుల కంటపడకుండా వాస్తవాలను దాచాల్సిన పనిలేదు..
ABN, First Publish Date - 2023-09-09T20:09:58+05:30
రెండ్రోజుల 'జీ-20' సదస్సు న్యూఢిల్లీలో శనివారంనాడు ప్రారంభమైన తొలిరోజే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడు ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. జీ-20కి వచ్చే విదేశీ అతిథుల కంటబడకుండా పేదలను ప్రభుత్వం దాచిపెట్టిందని, ఇండియా వాస్తవ స్థితిని దాచిపెట్టాల్సిన పని లేదని అన్నారు.
బ్రస్సెల్స్: రెండ్రోజుల 'జీ-20' (G-20) సదస్సు న్యూఢిల్లీలో శనివారంనాడు ప్రారంభమైన తొలిరోజే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడు ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. జీ-20కి వచ్చే విదేశీ అతిథుల కంటబడకుండా పేదలను (poor) ప్రభుత్వం దాచిపెట్టిందని, ఇండియా వాస్తవ స్థితిని (India's reality) దాచిపెట్టాల్సిన పని లేదని అన్నారు. మన పేద ప్రజలు, జంతువులను కూడా భారత ప్రభుత్వం దాచిపెట్టిందంటూ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ (Brussels) నుంచి రాహుల్ శనివారం ట్వీట్ చేశారు.
జి-20 సదస్సు నిర్వహణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై పలు కోణాల నుంచి కాంగ్రెస్ విమర్శల దాడి సాగిస్తోంది. సదస్సుకు ముందే ఢిల్లీలోని వసంత్ వివార్‌లో ఉన్న కూలీల శిబరాన్ని రాజధానిలోకి అడుగుపెట్టే అతిథుల కంటబడకుండా తెరలు కట్టిన ఒక వీడియోను కూడా కాంగ్రెస్ షేర్ చేరింది.
అంతర్జాతీయ అతిథులకు స్వాగతం పలికేందుకు జంతువులను కూడా విడిచిపెట్టడం లేదని, లెక్కకు మిక్కిలిగా వీధి కుక్కలును అత్యంత క్రూరంగా మెడపట్టుకుని బోనుల్లోకి నెడుతున్నారంటూ మరో వీడియోను కూడా కాంగ్రెస్ విడుదల చేసింది. ''వాటికి (జంతువులు) ఆహారం, నీళ్లు ఇవ్వడంలేదు. అవన్నీ భయంతో బిక్కచచ్చిపోతున్నాయి. ఇలాంటి భయంకరమైన చర్యలకు వ్యతిరేకంగా, మూగజీవులకు న్యాయం జరగాలనే డిమాండ్‌తో అంతదా ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది'' అని ఆ వీడియోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
Updated Date - 2023-09-09T20:17:42+05:30 IST