Railway lines: రాష్ట్రానికి కొత్తగా 9 రైలు మార్గాలు

ABN, First Publish Date - 2023-02-07T07:32:38+05:30

రాష్ట్రంలో కొత్తగా 9 రైలుమార్గాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పార్లమెంటులో ఈ నెల 1వ తేదీ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Minister Nirmala Sitharaman) బ

Railway lines: రాష్ట్రానికి కొత్తగా 9 రైలు మార్గాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), ఫిబ్రవరి 6: రాష్ట్రంలో కొత్తగా 9 రైలుమార్గాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పార్లమెంటులో ఈ నెల 1వ తేదీ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Minister Nirmala Sitharaman) బడ్జెట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి చెందిన రైల్వే పథకాలకు రూ.1,057 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం, రాణిపేట, కడలూర్‌, తిరువణ్ణామలై, ధర్మపురి, రామనాధపురం జిల్లా ధనుష్కోటి, కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని మెరుగుపరిచేలా కొత్త రైలు మార్గాలు ఏర్పాటుకానున్నాయి. చెంగల్పట్టు నుంచి మహాబలిపురం(Mahabalipuram) మీదుగా పుదుచ్చేరికి ఏర్పాటుకానున్న మార్గంలో త్వరలో మట్టి పరిశోధనలు ప్రారంభించనున్నారు. దిండివనం నుంచి తిరుపతి జిల్లా నగరి వరకు 180 కి.మీ మేర రూ.200 కోట్లతో బ్రాడ్‌ గేజ్‌ రైలుమార్గం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ మార్గంలో వందవాసి, సెయ్యా రు, ఆరణి, ఆర్కాడు, పల్లిపట్టు తదితర ప్రాంతాల్లో 18 రైల్వేస్టేషన్లు నిర్మించనున్నారు. కాగా, ప్రస్తుతం ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌లో దిండివనం-సెంజి-తిరువణ్ణామలై మధ్య రూ.50 కోట్లతో 70 కి.మీ మేర కొత్త రైలుమార్గం, చెన్నై నుంచి తిరువణ్ణామలై వరకు 225 కి.మీ దూరంలో మరో కొత్త రైలుమార్గం నిర్మించేందుకు కేంద్రం నిర్ణయుంచిందని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-02-07T07:32:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising