ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajnath Singh: ఐఎన్ఎస్ బాజ్‌ను సందర్శించిన రాజ్‌నాథ్

ABN, First Publish Date - 2023-01-06T18:42:48+05:30

గ్రేటర్ నికోబార్ ఐలాండ్‌లోని క్యాంప్‌బెల్ బే వద్ద భారత నావికాదళ ఎయిర్ స్టేషన్ 'ఐఎన్ఎస్ బాజ్'ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోర్ట్ బ్లెయిర్: గ్రేటర్ నికోబార్ ఐలాండ్‌లోని క్యాంప్‌బెల్ బే (Cambell Bay) వద్ద భారత నావికాదళ ఎయిర్ స్టేషన్ 'ఐఎన్ఎస్ బాజ్' (INS Baaz)ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారంనాడు సందర్శించారు. అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్సెసెస్ జాయింట్ సర్వీసెస్‌ కిందకు ఈ నావల్ ఎయిర్ స్టేషన్ వస్తుంది.

ప్రపంచంలోని కీలకమైన జలసంధుల్లో మలక్కా జలసంధి ఒకటి. ఇది వ్యూహాత్మక స్టాండ్ పాయింట్‌గా ఉంటోంది. ఈ మార్గం ద్వారానే మెజారిటీ చైనా దిగుమతులు జరుగుతుంటాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఐఎన్ఎస్ బాజ్‌ను సందర్శించిన అనంతరం కార్ నికోబార్‌లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను కూడా దర్శించిన్టటు రక్షణ శాఖ వర్గాలు తెలిపారు.

అండమాన్ నికోబార్ కమాండ్ (ఎఎన్‌సి)లో ఆపరేషనల్ ప్రిపేర్డ్‌నెస్‌ను సమీక్షించేందుకు రాజ్‌నాథ్ సింగ్ పోర్ట్ బ్లెయిర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రక్షణ అధికారులు, జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు. చైనాతో సరిహద్దుల వద్ద ఇటీవల తలెత్తిన ఉద్రిక్తతలు, లడఖ్‌లోని గల్వాన్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ యాంగ్సే‌ వరకూ భారత సైనికులు చూపించిన ధైర్య సాహసాలను కొనియాడారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కమాండర్ ఇన్ చీఫ్ అండమాన్ అండ్ నికాబార్ కమాండర్ (సీఐఎన్‌సీఏఎన్) లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సింగ్‌తో ఆయన అత్యున్నత సమావేశం జరుపనున్నారు. ఆపరేషనల్ సిట్యుయేషన్, మిలటరీ నిఘాకు సంబంధించిన ఫస్ట్‌హ్యాండ్ సమాచారాన్ని ఆయన నుంచి తెలుసుకుంటారు.

Updated Date - 2023-01-06T18:44:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising