ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ABN, First Publish Date - 2023-09-21T22:35:53+05:30

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు (Women Reservation Bill) రాజ్యసభ (Rajya Sabha) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు (Women Reservation Bill) రాజ్యసభ (Rajya Sabha) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మహిళా బిల్లుపై రాజ్యసభలో 10 గంటలకు పైగా చర్చ జరిగింది. ఇప్పటికే లోక్‌సభలో మహిళా బిల్లు ఆమోదం పొందింది. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అందుబాటులోకి రానున్నాయి. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు అనుకూలంగా 215 ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ ఉభయసభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందింది.


చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill) లోక్‌సభ (Lok sabha)లో ఆమోదం పొందింది. కొత్త పార్లమెంటులోని లోక్‌సభలో తొలిసారి ఆమోదం పొందిన బిల్లు ఇదే కావడం విశేషం. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈనెల 19న ప్రవేశపెట్టిన బిల్లుపై బుధవారం నాడు చర్చ చేపట్టారు. సుమారు 8 గంటల సేపు చర్చ అనంతరం దీనిపై ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 454 మంది ఎంపీలు ఓటు వేయగా, ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేశారు.

ఓటింగ్ ఇలా జరిగింది..

రాజ్యాంగ బిల్లు కావడంతో మాన్యువల్ పద్దతిలో లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఈ ఓటింగ్‌ను నిర్వహించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగు స్పిప్పులను సభ్యులందరికీ అందజేశారు. ఓటింగ్ విధానాన్ని కూడా ఆయన వివరించారు. బిల్లుకు ఆమోదం తెలిపిన పక్షంలో ఆకుపచ్చ రజంగు కాగితంపై 'ఎస్' అని రాయాలి. వ్యతిరేకించే వారు ఎరుపు రంగు స్లిప్‌పై 'నో' అని రాయాల్సి ఉంటుంది. ఓటింగ్ అనంతరం బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినట్టు సభాపతి ఓం బిర్లా ప్రకటించారు.

Updated Date - 2023-09-21T22:43:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising