ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi Services Bill: ఢిల్లీ సర్వీసుల బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ABN, First Publish Date - 2023-08-07T22:23:58+05:30

ఢిల్లీ సర్వీసుల బిల్లుకి రాజ్యసభ ఆమోదం పొందింది. ఈ బిల్లుకి వ్యతిరేకంగా 102 ఓట్లు రాగా.. అనుకూలంగా 131 ఓట్లు నమోదు అయ్యాయి. రాజ్యసభలో మొత్తం 237 మంది సభ్యులు ఉండగా.. బిల్లు పాస్ అవ్వడానికి 119 మంది ఓట్లు అవసరం ఉంటుంది.

ఢిల్లీ సర్వీసుల బిల్లుకి రాజ్యసభ ఆమోదం లభించింది. ఈ బిల్లుకి వ్యతిరేకంగా 102 ఓట్లు రాగా.. అనుకూలంగా 131 ఓట్లు నమోదు అయ్యాయి. రాజ్యసభలో మొత్తం 237 మంది సభ్యులు ఉండగా.. బిల్లు పాస్ అవ్వడానికి 119 మంది ఓట్లు అవసరం ఉంటుంది. అంతకుమించి 131 ఓట్లు నమోదైన నేపథ్యంలో.. రాజ్యసభ ఈ బిల్లుకి ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి ఆమోదం కోసం ఈ బిల్లును కేంద్రం పంపనుంది.

అంతకుముందు ఈ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ కొనసాగింది. చర్చ అనంతరం విపక్షాలు బిల్లుపై ఓటింగ్ కోరడంతో.. రాజ్యసభ వైస్‌చైర్మన్ హరివంశ్ ఓటింగ్ నిర్వహించారు. ఆటోమెటిక్ ఓటింగ్ మిషన్ సిస్టమ్‌లో సాంకేతిక లోపాలున్న కారణంగా.. స్లిప్స్ ద్వారా ఈ ఓటింగ్‌ను నిర్వహించడం జరిగింది. బిల్లుకు అనుకూలంగా అధికార ఎన్డీఏ కూటమికి 131 నమోదవ్వగా.. బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష కూటమి ‘ఇండియా’కు 102 ఓట్లు వచ్చాయి. ఇప్పటికే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే. ఉభయసభలు ఈ బిల్లుని ఆమోదించడంతో.. ‘ఢిల్లీ ఆర్డినెన్స్’ చట్టం కానుంది.


ఈ బిల్లును సవరించాలని కోరుతూ.. ఆప్ ఎంపీ రాజీవ్ చడ్డా సహా పలువురు విపక్ష పార్టీల ఎంపీలు ప్రతిపాదనలు చేశారు. మొత్తం 70కి పైగా సవరణల్ని విపక్ష ఎంపీలు ప్రతిపాదించారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సవరణల కోసం అనుమతి లేకుండా పలువురు ఎంపీల సంతకాలు దుర్వినియోగం చేశారని, ఇందుకు రాజీవ్ చడ్ఢానే కారణమని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో సభా హక్కుల కమిటీ విచారణ జరపాలని షా డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కొద్దిసేపు సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.

Updated Date - 2023-08-07T22:27:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising