Ayodhya Ram Temple is the sanctum sanctorum : రామా.. రఘురామా!
ABN, First Publish Date - 2023-12-10T03:50:55+05:30
అయోధ్య రామాలయంలో గర్భగుడి దాదాపుగా సిద్ధమైంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శనివారం నిర్మాణం చివరిదశలో ఉన్న రామాలయం గర్భ గుడి చిత్రాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
తుది దశకు అయోధ్య రామాలయం గర్భగుడి
న్యూఢిల్లీ, డిసెంబరు 9: అయోధ్య రామాలయంలో గర్భగుడి దాదాపుగా సిద్ధమైంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శనివారం నిర్మాణం చివరిదశలో ఉన్న రామాలయం గర్భ గుడి చిత్రాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 గంటల లోపు జరుగుతుంది. విగ్రహాలు 90 శాతం పూర్తయ్యాయి. ప్రాణ ప్రతిష్ఠ సంప్రదాయ క్రతువులు జనవరి 16 నుంచి ప్రారంభమవుతాయి. కాగా, రామమందిరం ప్రధాన ఆచార్యునిగా మోహిత్ పాండే నియమితులయ్యారు. ఆయన ఘాజియాబాద్‌లోని శ్రీ దూధేశ్వర్ మఠ్‌లోని వేద పాఠశాల, అనంతరం శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు.
Updated Date - 2023-12-10T03:50:56+05:30 IST