ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi House: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం..!

ABN, First Publish Date - 2023-07-03T09:41:01+05:30

ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం రేపింది. ‘నో-ఫ్లైయింగ్ జోన్’లో డ్రోన్లు కనిపించడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఎస్పీజీ భద్రతా సిబ్బంది ఢిల్లీ పోలీసులకు సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై (PM Modi House) డ్రోన్ కలకలం రేపింది. ‘నో-ఫ్లైయింగ్ జోన్’లో (No-Flying Zone) డ్రోన్లు కనిపించడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఎస్పీజీ భద్రతా సిబ్బంది (SPG) ఢిల్లీ పోలీసులకు సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు (Delhi Police) వెల్లడించారు. ఆ డ్రోన్ కోసం ఢిల్లీ పోలీసుల అన్వేషణ మొదలైంది. ఇప్పటికైతే ఎలాంటి డ్రోన్ ఆచూకీ తెలియలేదు. ప్రధాని నివాసం ‘రెడ్ నో-ఫ్లై జోన్ లేదా నో డ్రోన్ జోన్’ పరిధిలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ జోన్‌లో డ్రోన్లపై నిషేధం ఉంటుంది. అయినప్పటికీ డ్రోన్ కనిపించిందని ఎస్పీజీ అధికారులు చెప్పడం కలకలం రేపుతోంది.

ఢిల్లీలోని ‘రేస్ కోర్స్ రోడ్’లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం ఉంది. ఈ నివాసం ఐదు భవనాల సముదాయం. 9,7,5,3,1 నంబర్లతో ఆ భవనాలు ఉండటం గమనార్హం. ప్రధాని కార్యాలయ సముదాయం భద్రతా వలయంలో ఉంటుంది. సామాన్య ప్రజానీకానికే కాదు మీడియాకు కూడా అనుమతి కష్టం. కొన్ని సందర్భాల్లో మాత్రమే విలేకరులను కాన్ఫరెన్స్ రూమ్స్ వరకూ అనుమతిస్తారు. అయితే.. ఫొటోలు తీయడం మాత్రం నిషేధం.

Updated Date - 2023-07-03T09:56:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising