ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Love Marriage: ప్రేమ పెళ్లిపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు.. ఆ హక్కు ఫ్యామిలీకి లేదంటూ కుండబద్దలు

ABN, First Publish Date - 2023-10-26T18:20:01+05:30

ఢిల్లీ హైకోర్టు ప్రేమ పెళ్లిపై గురువారం సంచలనం తీర్పు ఇచ్చింది. ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని తెలిపింది. కుటుంబ సభ్యులు అలాంటి వివాహాలకు అభ్యంతరం చెప్పలేరని...

ఢిల్లీ హైకోర్టు ప్రేమ పెళ్లిపై గురువారం సంచలనం తీర్పు ఇచ్చింది. ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని తెలిపింది. కుటుంబ సభ్యులు అలాంటి వివాహాలకు అభ్యంతరం చెప్పలేరని తేల్చి చెప్పింది. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్లను విడదీసే హక్కు ఫ్యామిలీకి లేదని వెల్లడించింది. ఇటీవల తమ కుటుంబాల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న ఓ జంటకు తమ ఫ్యామిలీ నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో.. వాళ్లు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ని విచారించిన న్యాయస్థానం.. ఆ జంటకు పోలీసు రక్షణ కల్పిస్తూ, ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.


విచారణ సందర్భంగా జస్టిస్ తుషార్ రావు గేదెల మాట్లాడుతూ.. పౌరులకు భద్రత కల్పించడం మన రాజ్యాంగ బాధ్యత అని తెలిపారు. పిటిషనర్ తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు రాజ్యాంగం ప్రకారం చెరగనిదని, రక్షించబడినదని చెప్పారు. ఏ విధంగానూ ఆ వివాహం బలహీనపరచబడదని పేర్కొన్నారు. పిటిషనర్ల వివాహం వాస్తవమని, వాళ్లిద్దరు మేజర్ అనే మాట వాస్తవమని, ఇందులో ఎలాంటి సందేహం లేదని జస్టిస్ అన్నారు. అలాంటప్పుడు.. పిటిషనర్ల వివాహ సంబంధానికి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేరని వెల్లడించారు. తన పౌరులకు రక్షణ కల్పించాల్సిన రాజ్యాంగ బాధ్యతలో రాష్ట్రం ఉందని.. హైకోర్టు కూడా రాజ్యాంగ న్యాయస్థానం కావడంతో దంపతుల రాజ్యాంగ హక్కులను మరింత పెంచుతుందని చెప్పుకొచ్చారు.

ఇదిలావుండగా.. ఎవరైతే ఢిల్లీ హైకోర్టులో తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కోసం పిటిషన్ దాఖలు చేశారో, ఆ జంట ఏప్రిల్‌లో వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యుల్ని ఎదురించి మరీ వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వీళ్లు సంతోషంగానే జీవిస్తున్నారు. అయితే.. ఇటీవల వీరికి కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో.. వాళ్లు కోర్టు మెట్లెక్కారు. పిటిషనర్ వాదనలు విన్న తర్వాత కొత్త జంటకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. ఒక బీట్ అధికారి ఎప్పటికప్పుడు తనిఖీ నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ తన ప్రస్తుత నివాస చిరునామా ఇవ్వాలని, ఒకవేళ ఇళ్లు మారితే ఆ ప్రాంతంలోని పోలీసులను సంప్రదించాలని కోర్టు తెలిపింది.

Updated Date - 2023-10-26T18:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising