ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

S Jaishankar: మా వల్లే అది సాధ్యమైంది, మీరంతా కృతజ్ఞత చెప్పాలి.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-11-16T16:01:31+05:30

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన కొత్తలో.. ప్రపంచ ఆర్థిక పరిస్థితి కాస్త అయోమయంగా కనిపించింది. ముఖ్యంగా.. చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉందని విశ్లేషకులు భావించారు. కానీ.. అలాంటి సిచ్యువేషన్ రాకుండా భారత్ సరైన నిర్ణయాలు తీసుకుందని..

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన కొత్తలో.. ప్రపంచ ఆర్థిక పరిస్థితి కాస్త అయోమయంగా కనిపించింది. ముఖ్యంగా.. చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉందని విశ్లేషకులు భావించారు. కానీ.. అలాంటి సిచ్యువేషన్ రాకుండా భారత్ సరైన నిర్ణయాలు తీసుకుందని.. వ్యూహాత్మక కొనుగోలు విధానాల ద్వారా చమురు, గ్యాస్ ధరలు పెరగకుండా స్థిరీకరించిందని.. ఫలితంగా అంతర్జాతీయ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించిందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నొక్కిచెప్పారు. ఇందుకు ప్రపంచ దేశాలు తమకు ధన్యవాదాలు తెలిపాలని కోరారు. ప్రస్తుతం బ్రిటన్‌లో పర్యటిస్తున్న ఆయన.. లండన్‌లోని భారత హైకమిషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘మా కొనుగోలు విధానాల ద్వారా చమురు, గ్యాస్ మార్కెట్లను స్థిరీకరించాం. దాని పర్యవసానంగా.. మేము అంతర్జాతీయ ద్రవ్యోల్బణాన్ని మేము నిర్వహించాం. కాబట్టి.. ప్రపంచ దేశాల నుంచి ధన్యవాదాల కోసం నేను ఎదురుచూస్తున్నాను’’ అని జైశంకర్ చెప్పుకొచ్చారు. చమురు కొనుగోళ్లలో భారతదేశం అనుసరిస్తున్న విధానం ప్రపంచ చమురు ధరల పెరుగుదలను నిరోధించిందని, మార్కెట్‌లో యూరప్‌తో సంభావ్య పోటీని నిరోధించిందని మంత్రి వివరించారు. తాము రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లలో చమురు విక్రేతల వద్దకు వెళ్లి ఉంటే.. అప్పుడు చమురు ధరలు ఊహించనంత స్థాయిలో పెరిగేవని తాము కనుగొన్నామన్నారు. ఫలితంగా.. అదే ధరలకు ఐరోపా కూడా కనుగోలు చేయాల్సి వచ్చేదని విశ్లేషించారు.

యుద్ధం ప్రారంభమైన సమయంలో.. ఎల్‌పీజీ మార్కెట్లలో సాంప్రదాయబద్దంగా ఆసియాకు రావాల్సిన సరఫరాదారులు యూరప్‌కి తరలిపోయారని జైశంకర్ పేర్కొన్నారు. కొన్ని చిన్న దేశాలు ఎల్‌పీజీ ఇంధన కొనుగోలు కోసం దాఖలు చేసిన టెండర్లపై కూడా సరఫరాదారులు స్పందించేందుకు ఆసక్తి చూపించలేదని.. పెద్ద దేశాలతోనే ముందుకు సాగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. రష్యాతో బలమైన సంబంధాన్ని కొనసాగించాలని భారత్ నిర్ణయించింది. అలాగే.. రష్యా-ఉక్రెయిన్‌పై భారత్ వైఖరిని వెల్లడిస్తూ.. సూత్రాలు, ప్రయోజనాల మధ్య సమతుల్యతను ఎత్తిచూపారు.

Updated Date - 2023-11-16T16:01:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising