ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sansad Ratna award: సంసద్ రత్న అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు చోటేది?

ABN, First Publish Date - 2023-03-25T11:50:15+05:30

పార్లమెంటులో శనివారం నాడు సంసద్ రత్న అవార్డులను ప్రదానం చేయనున్నారు....

Sansad Ratna award 2023
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: పార్లమెంటులో శనివారం నాడు సంసద్ రత్న అవార్డులను ప్రదానం చేయనున్నారు. సంసద్ రత్న(Sansad Ratna award) 2023 అవార్డుల కోసం 13 మంది పార్లమెంటు సభ్యులను ఎంపిక చేశారు. సంసద్ రత్న అవార్డుల ఎంపికలో రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు(Telugu state MPS) చోటు దక్కలేదు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రాం మేఘావాల్ అధ్యక్షతన, కో ఛైర్మన్ ఎన్నికల కమిషన్ మాజీ ప్రధానాధికారి టీఎస్ కృష్ణమూర్తిలతో ఏర్పాటైన జ్యూరీ కమిటీ లోక్ సభ నుంచి 8 మంది, రాజ్యసభ నుంచి ఐదుగురు సభ్యులను ఎంపిక చేసింది. 17వ లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలు, ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లులు, పాల్గొన్న డిబేట్లను బట్టి సంసద్ రత్న అవార్డులకు 13 మందిని ఎంపిక చేశారు.

అధీర్ రంజన్ చౌదరి(పశ్చిమబెంగాల్), గోపాల్ చినయ్య శెట్టి (మహారాష్ట్ర), సుధీర్ గుప్తా(మధ్యప్రదేశ్), డాక్టర్ అమోల్ రాంసింగ్ (మహారాష్ట్ర), బిద్యూత్ బారన్ మహతో(జార్ఖండ్), డాక్టర్ సుకుంత మజుందార్(పశ్చిమబెంగాల్), కుల్దీప్ రాయ్ శర్మ(అండమాన్ నికోబార్ దీవులు), డాక్టర్ మీనా విజయకుమార్ గవిట్ (మహారాష్ట్ర)లను సంసద్ అవార్డులకు ఎంపిక చేశారు. రాజ్యసభ నుంచి శ్రీమతి ఫౌజియా తహసీన్ అహ్మద్ ఖాన్(మహారాష్ట్ర), డాక్టర్ జాన్ బ్రిట్టాస్(కేరళ), డాక్టర్ మనోజ్ కుమార్ ఝా(బీహార్),విశ్వంభర్ ప్రసాద్ (యూపీ), శ్రీమతి ఛాయావర్మ(ఛత్తీస్ ఘడ్)లకు సంసద్ అవార్డులు ప్రకటించారు.

ఇది కూడా చదవండి : Karnataka polls: కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల...కుమారుడి స్థానంలో సిద్ధరామయ్య వరుణ సెగ్మెంట్ నుంచి పోటీ

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు ఈ సంసద్ అవార్డులు దక్కక పోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన మాజీ ఎంపీ టీకే రంగరాజన్ కు లైఫ్ టైం ఎచ్ఛీవ్ మెంట్ అవార్డు ప్రదానం చేయనున్నారు. మొత్తం మీద శనివారం ఈ అవార్డులు ఇవ్వనుండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు ఎంపీలు ఈ అవార్డులకు నోచుకోక పోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2023-03-25T11:50:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising