ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cauvery River Dispute: కావేరీ జలాల పంపకంపై రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీం ఓకే

ABN, First Publish Date - 2023-08-21T13:36:25+05:30

కావేరీ జల పంపకాలకు సంబంధించిన వివాదంపై రాజ్యంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ: కావేరీ జల పంపకాలకు సంబంధించిన వివాదం (Cauvery River Water sharing dispute)పై రాజ్యంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది. న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది.


కావేరీ జలాల వివాదం కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి మధ్య దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక్కడి లక్షలాది మంది ప్రజలకు ఇరిగేషన్, తాగునీటి అవసరాలను కావేరీ జలాలు తీరుస్తున్నాయి. దీంతో కావేరీ జలాల పంపాకలపై తరచు రాష్ట్రాల మధ్య విభేదాలు చేరుకుంటున్నాయి. దీనిపై చివరిసారిగా 2018లో సుప్రీంకోర్టు విచారణ జరిపి, కావేరీ మేనిజిమెంట్ స్కీమ్‌ను నోటిఫై చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. జలాల పంపాకలపై సుప్రీంకోర్టు తీర్పును అమలును చేసేందుకు ఈ స్కీమ్‌ను ఉద్దేశించారు. అయితే, కావేరీ మేనేజిమెంట్ స్కీమ్‌ను ఇంతవరకూ కేంద్రం నోటిఫై చేయలేదు. దీంతో తరచు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశించడం సానుకూల పరిణామంగా చెప్పవచ్చు.


బెంచ్ ఏర్పాటు ద్వారా ఈ వివాదానికి అంతిమ పరిష్కారం కనుగొనే అవకాశం ఉంటుంది. రాబోయే కొద్ది వారాల్లో బెంచ్ ఏర్పాటయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 2023 సెప్టెంబర్ 15లోగా తమ వాదనలను కోర్టుకు సమర్పించాలని రాష్ట్రాలను అత్యున్నత న్యాయస్థానం అదేశించింది. ఈ క్రమంలో రాష్ట్రాల అవసరాలు, పర్యావరణం, శాంతి భద్రతలను పరిగణనలోకి తీసుకుని అందరికీ ఉపయుక్తమైన నిష్పాక్షిక నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం తీసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - 2023-08-21T13:36:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising