ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Atiq Ahmed: అతీఖ్ జీవితంలో మరో మహిళ.. షబానా కోసం పోలీసుల ఆరా!

ABN, First Publish Date - 2023-04-28T17:33:24+05:30

అతీఖ్ జీవితంలోని మరో మహిళ విషయాలు పోలీసులకు తెలిశాయి. షబానా (Shabana) అనే పేరున్న ఈ మహిళ అతీఖ్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్ పాల్ హత్య‌కు ముందు సబర్మతి జైలులో కలిశారు.

Secret Woman in Atiq Ahmed life
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్‌‌లో(Prayagraj) ఏప్రిల్ 15న గ్యాంగ్‌స్టర్‌ అతీఖ్ అహ్మద్‌ (Atiq Ahmed) అతడి సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌ (Ashraf)‌‌ హత్యల తర్వాత పోలీసుల దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతీఖ్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్‌ (Shaista Parveen) రెండు నెలలుగా పరారీలో ఉండగా ఆమె ఆచూకీ ఇంకా తెలియలేదు. అయితే అతీఖ్ జీవితంలోని మరో మహిళ విషయాలు పోలీసులకు తెలిశాయి. షబానా (Shabana) అనే పేరున్న ఈ మహిళ అతీఖ్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్ పాల్ హత్య‌కు ముందు సబర్మతి జైలులో కలిశారు. సబర్మతి జైలుతో పాటు దేవరియా, బరేలీ, ప్రయాగ్‌రాజ్ జైళ్లలో నిరంతరం ఆమె అతీఖ్‌ను కలిశారు. అతీఖ్ మాఫియా ప్రపంచంతోనూ ఆమెకు విడదీయరాని అనుబంధం ఉందని పోలీసులకు సమాచారం అందింది. షబానా క్రమం తప్పకుండా అతీఖ్‌ను కలుస్తుండటంపై ఆయన భార్య షైస్తా పర్వీన్ అభ్యంతరం వ్యక్తం చేసేవారని తెలిసింది. ఈ అభిప్రాయభేదాలపై కూడా పోలీసులకు అతీఖ్ గ్యాంగ్ సభ్యుల నుంచి సమాచారం అందింది. షబానా ప్రయాగ్‌రాజ్‌లోని కరేలీలో ఉంటారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలన్నీ షబానా అందించబోయే వివరాల కోసం ఎదురుచూస్తున్నాయి.

అటు షైస్తా పర్వీన్‌ కోసం పోలీసుల వెతుకులాట కొనసాగుతోంది. ఢిల్లీ, లక్నోలో యూపీ ఎస్టీఎఫ్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గాలింపు జరిపారు. ఢిల్లీ కరోల్‌బాగ్, జామియా నగర్ తదితర ప్రాంతాల్లో షైస్తా కోసం పలువురిని ప్రశ్నించారు. షైస్తా పర్వీన్‌ ఢిల్లీలో ఓ న్యాయవాదితో టచ్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అతీఖ్ సోదరుడు అష్రఫ్ భార్య జైనాబ్ (Zainab) ఆచూకి కూడా ఇంకా తెలియలేదు. ఇంటికి తాళం కూడా వేయకుండా వారంతా పరారయ్యారు. అతీఖ్, అష్రఫ్‌ల అంత్యక్రియలకు కూడా షైస్తా పర్వీన్‌‌, జైనాబ్ హాజరుకాలేదు. షైస్తా పర్వీన్‌ తలపై 50 వేల రూపాయల రివార్డ్ కూడా ఉంది. అతీఖ్ అహ్మద్ నేరసామ్రాజ్యాన్ని నడపడంలో షైస్తా పర్వీన్‌ కీలకంగా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అతీఖ్ అహ్మద్ జైలులో ఉండగా మాఫియా సభ్యులతో అక్రమ వ్యవహారాలన్నీ ఆమెనే చక్కబెట్టారని పోలీసులు చెబుతున్నారు. షైస్తా లొంగిపోతారని వస్తున్న ప్రచారాన్ని అతీఖ్ తరపు న్యాయవాది విజయ్ మిశ్రా తోసిపుచ్చారు. అవన్నీ పుకార్లేనని చెప్పారు. ఇటీవలే షైస్తా బుర్ఖా ధరించకుండా ఓ పెళ్లిలో పాల్గొన్నారంటూ ఫొటోలు వైరల్ అయ్యాయి.

అతి త్వరలో షైస్తా ఆచూకీ కనిపెడతామని పోలీసులంటున్నారు. ఇంతలోనే షబానా విషయం బయటకు రావడంతో ఆమె ద్వారా అతీఖ్ నేర సామ్రాజ్యానికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తాయని పోలీసులు ఆశిస్తున్నారు.

గ్యాంగ్‌స్టర్‌ అతీఖ్ అహ్మద్‌ మొత్తం 4సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా కూడా గెలిచారు. తన తమ్ముడు అష్రఫ్‌ను ఓడించాడని బీఎస్పీ అభ్యర్థి రాజు పాల్‌ను 2005లో అతీఖ్ హత్య చేయించాడు. అది కూడా రాజు పాల్‌కు పెళ్లైన 9 రోజులకే. ఇదే ఘటనలో సాక్షిగా ఉన్న ఉమేశ్ యాదవ్ అనే న్యాయవాదిని అతీఖ్ అహ్మద్ ఫిబ్రవరి 24న హత్య చేయించాడు. మొత్తం 10 మంది ఘటనలో పాల్గొనగా యూపీ పోలీసులు అతీఖ్ అహ్మద్ తనయుడు అసద్‌ను, అతడి స్నేహితుడు గులామ్‌ను ఇటీవలే ఎన్‌కౌంటర్ చేశారు. ఉమేశ్ హత్యా ఘటనలో బాంబులు విసిరిన గుడ్డూ ముస్లింతో పాటు ఇతరుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

యూపీలో యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో మొత్తం 183 మంది క్రిమినల్స్‌ను పోలీసులు లేపేశారు. 15 వేల మందికి పైగా అరెస్ట్ చేశారు. మాఫియా డాన్‌ల నుంచి వేల కోట్ల ఆస్తులు జప్తు చేశారు. వరుస ఎన్‌కౌంటర్లు, పోలీసుల కఠిన వైఖరితో గ్యాంగ్‌స్టర్ల కుటుంబ సభ్యులు కూడా పరారీలో ఉంటున్నారు. గ్యాంగ్‌స్టర్లైతే ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు పారిపోయి రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారు.

Updated Date - 2023-04-28T17:33:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising