ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Setu Samudram: ‘సేతు సముద్రం’పై ముక్తకంఠంతో మద్దతు

ABN, First Publish Date - 2023-01-13T10:35:00+05:30

రాష్ట్రానికి లబ్ది చేకూర్చిపెట్టే ‘సేతు సముద్రం’(Setu Samudram) ప్రాజెక్టును తక్షణం పూర్తిచేయాలన్న డిమాండ్‌కు అసెంబ్లీలో అన్ని పార్టీల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి లబ్ది చేకూర్చిపెట్టే ‘సేతు సముద్రం’(Setu Samudram) ప్రాజెక్టును తక్షణం పూర్తిచేయాలన్న డిమాండ్‌కు అసెంబ్లీలో అన్ని పార్టీల నేతలు ముక్తకంఠంతో మద్దతు పలికారు. బీజేపీ, అన్నాడీఎంకే వంటి పార్టీలు కొన్ని సూచనలు చేసినా, ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ గురువారంఅసెంబ్లీలో ప్రతిపాదించినతీర్మానానికి మద్దతు పలకడం విశేషం. తక్షణం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్‌ను అందరూ ముక్త కంఠంతో ఆమోదించారు. ఈ సందర్భంగా ఎవరేమన్నారంటే..!

మంత్రి తంగం తెన్నరసు

2 వేల ఏళ్ల క్రితమే సముద్రం మార్గంగా వాణిజ్యం చేసిన వారు తమిళులు. సేతు సముద్రం ప్రాజెక్ట్‌ నెరవేర్చేలా ముఖ్యమంత్రి తీసుకొచ్చిన ప్రత్యేక తీర్మానాన్ని డీఎంకే తరఫున స్వాగతిస్తున్నాం.

అన్నాడీఎంకే సీనియర్‌ నేత పొల్లాచ్చి జయరామన్‌

రాముడు కల్పిత పాత్ర అని చెప్పడం అభ్యంతరకరం. ఈ ప్రాజెక్ట్‌ ఖర్చు చేసిన నిధులపై అధ్యయనం చేయాలి. సాధక బాధకాలు విశ్లేషించి ప్రణాళిక అమలుచేయాలి.

మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం

ముఖ్యమంత్రి తీర్మానంపై లోటుపాట్లు చర్చించి బలోపేతం చేయాలి. ప్రాజెక్ట్‌ అమలుకు అందరి మద్దతు అడగండి. గతంలో రాజకీయపార్టీలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. వాటిని చర్చించేందుకు ఇది సమయం కాదు. ఆహ్వానించాల్సిన ప్రాజెక్ట్‌ల్లో ఇది ఒకటి. సాధక బాధకాలు అధ్యయనం చేసి అమలుచేయాలి.

కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత సెల్వ పెరుందగై

రామాయణంలోని పలు అంశాలు చర్చించారు. ఈ ప్రాజెక్ట్‌ అమలుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. 2024లో కేంద్రంలో అధికారం మార్పు జరగడంతో పాటు ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తవ్వడం తధ్యం. ప్రస్తుతం అధికారంలో ఉన్న వారు చేయపట్టకపోయినా కొత్త ప్రభుత్వం పూర్తిచేస్తుంది. ఈ తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం.

పీఎంకే శాసనసభాపక్ష నేత జీకే మణి

రాష్ట్రాభివృద్ధికి ఈ ప్రాజెక్ట్‌ అవసరం. అలాగే, దేశాభివృద్ధికి కూడా దోహదపడుతుందని కేంద్రప్రభుత్వం తెలుసుకోవాలి. ఈ ప్రాజెక్ట్‌ అమలుకు ముఖ్యమంత్రి చేపట్టే ప్రయత్నాలకు పీఎంకే మద్దతుగా ఉంటుంది.

బీజేపీ శాసనసభాపక్ష నేత నయినార్‌ నాగేంద్రన్‌

రామసేతు దెబ్బతినకుండా చేపట్టే సేతు సముద్రం ప్రాజెక్ట్‌ అమలుకు బీజేపీ మద్దతు ఇస్తుంది.

మనిదనేయ మక్కల్‌ కట్చి

అధినేత జవాహిరుల్లా

తమిళనాడుకు ఎంతో మేలు చేసే సేతు సముద్రం ప్రాజెక్ట్‌ను కేంద్రప్రభుత్వం అడ్డుకోరాదు. ఆ ప్రాజెక్ట్‌ అమలుకు రాష్ట్రప్రభుత్వం చేపట్టిన చర్యలను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం.

ఎమ్మెల్యేలు వేల్‌ మురుగన్‌, నాగై మాలి

150 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్‌ పూర్తిచేసివుంటే చిన్నరకం ఓడలు వెళ్లే సౌకర్యం ఉండేది. ఇప్పుడు ఏ నౌక వెళ్లాలన్నా శ్రీలంక చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ అమలుకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టడాన్ని ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర ప్రజల దీర్ఘకాల కోరికగా ఉన్న సేతు సముద్రం ప్రాజెక్ట్‌ను కేంద్రప్రభుత్వం సత్వరం పూర్తిచేయాలి. ఈ మేరకు మేము గతంలోనే పలు పోరాటాలు చేపట్టాం.

Updated Date - 2023-01-13T10:35:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising