ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Uttarakhand: ఉత్తరకాశిలో ఘోర ప్రమాదం.. టన్నెల్‌‌లో చిక్కుకుపోయిన 36 మంది

ABN, First Publish Date - 2023-11-12T13:45:40+05:30

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక సొరంగం కుప్పకూలడంతో 36 మంది వరకూ అందులో చిక్కుకుపోయారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ సహాయక కార్యక్రమాలు చేపట్టింది.

ఉత్తరకాశి: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి (Uttarakashi)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక సొరంగం (Tunnel) కుప్పకూలడంతో 36 మంది వరకూ అందులో చిక్కుకుపోయారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ సహాయ బృందం హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా మెజిస్ట్రేట్, ఎస్‌పీ దగ్గరుండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. టన్నల్ స్టార్టింగ్ పాయింట్ నుంచి 200 మీటర్ల వరకూ కుప్పకూలినట్టు అధికారి ఒకరు తెలిపారు.


టన్నెల్ కుప్పకూలడంతో 36 మంది వరకూ అందులో చిక్కుకుపోయినట్టు జిల్లా కంట్రోల్ రూమ్‌కు సమాచారం వచ్చిందని, వెంటనే ఎస్‌డీఆర్ఎఫ్ కమాండర్ మణికంఠ్ మిశ్రా ఆదేశాలతో సహాయక సామాగ్రితో సహా సిబ్బంది ఘటనా స్థలికి వెళ్లినట్టు ఎస్‌డీఆర్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. కాగా, ఇంతవరకూ మృతుల సమాచారం లేదని, సాధ్యమైనంత త్వరలోనే టన్నల్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువస్తామని ఎస్‌పీ ఆర్పన్ యదువంశి తెలిపారు.


సీఎం ఆదేశాలు

ప్రమాద ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఘటనా స్థలిలోని అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నామని చెప్పారు. ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సహాయక చర్యలు చేపట్టాయని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా బయటపడాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు.

Updated Date - 2023-11-12T13:50:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising