ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shanti Bhushan: కీలక ఘట్టాల సాక్షి శాంతి భూషణ్‌ కన్నుమూత

ABN, First Publish Date - 2023-02-01T02:40:55+05:30

దేశంలోని కీలక రాజకీయ ఘట్టాలకు సాక్షిగా నిలిచిన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్‌ (97) మంగళవారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర న్యాయమంత్రిగా విశేష సేవలు

ఇందిరాగాంధీ ఎన్నిక రద్దయ్యేలా

వాదించింది ఆయనే

న్యూఢిల్లీ, జనవరి 31: దేశంలోని కీలక రాజకీయ ఘట్టాలకు సాక్షిగా నిలిచిన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్‌ (97) మంగళవారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1925 నవంబరు 21న ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్‌లో జన్మించిన శాంతిభూషణ్‌ అలహాబాద్‌లో విద్యాభ్యాసం చేశారు. శాంతి భూషణ్‌ అంటే మొదటగా గుర్తు వచ్చేది ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి ఓడిపోయిన ఎస్‌ఎ్‌సపీ పార్టీ అభ్యర్థి రాజ్‌నారాయణ్‌ పెట్టిన కేసు దేశ రాజకీయాలను మలుపుతిప్పింది. ఇందిరాగాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, అందువల్ల ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆయన కేసు పెట్టారు. ఆ కేసును వాదించింది శాంతి భూషణ్‌ కావడం విశేషం. ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇవ్వడం, అనంతరం ఆమె ఎమర్జెన్సీని విధించడం దేశ చరిత్రలో కీలక పరిణామం. ఎమర్జెన్సీ సమయంలోనే ఇందిరాగాంఽధీ రాజ్యాంగం 42వ సవరణను తీసుకొచ్చి నిబంధనలను ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. అనంతరం ఏర్పాటయిన జనతాపార్టీ ప్రభుత్వంలో న్యాయమంత్రిగా పనిచేసిన శాంతిభూషణ్‌ 44వ సవరణను ప్రవేశపెట్టి ఆ మార్పులను రద్దు చేసి రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టారు. ప్రముఖ న్యాయవాదిగా పేరు గడించిన ఆయనకు రాజకీయాలతోనూ సంబంధం ఉంది. తొలుత కాంగ్రెస్‌ (ఓ)లో ఉండేవారు. ఎమర్జెన్సీ అనంతరం జనతా పార్టీలో చేరారు. 1977 నుంచి 1980 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు.

ఇదే సమయలో మొరార్జీ దేశాయి ఆధ్వర్యంలోని జనతా పార్టీ ప్రభుత్వంలో 1977 నుంచి 1979 వరకు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా వ్యవహరించారు. 2012లో ఆమ్‌ ఆద్మీ పార్టీ స్థాపించినప్పుడు ఆయన కూడా వ్యవస్థాపక సభ్యునిగా ఉన్నారు. న్యాయ వ్యవస్థ పరిణామ క్రమంలో తన అనుభవాలపై శాంతి భూషణ్‌.. కోర్టింగ్‌ డెస్టినీ, మై సెకండ్‌ ఇన్నింగ్స్‌ పేరుతో రెండు పుస్తకాలు రాశారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు ప్రశాంత్‌ భూషణ్‌ ఆయన కుమారుడే. తన తండ్రి మరణంతో ఒక శకం ముగిసినట్టయిందంటూ ఆయన నివాళులు అర్పించారు.

Updated Date - 2023-02-01T02:40:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising