ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shantro Ravi: ఎవరీ శాంట్రో రవి..?

ABN, First Publish Date - 2023-01-10T11:42:00+05:30

రాష్ట్రంలో ఎన్నికల వేడి కంటే గత వారం రోజులుగా శాంట్రో రవి(Shantro Ravi)కి సంబంధించిన అంశాలే హల్‌చల్‌గా మారాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రాజకీయాలను కుదిపేస్తున్న వైనం

- వ్యభిచార కేంద్రం నిర్వహణ నుంచి బదిలీల బ్రోకర్‌ దాకా..

బెంగళూరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నికల వేడి కంటే గత వారం రోజులుగా శాంట్రో రవి(Shantro Ravi)కి సంబంధించిన అంశాలే హల్‌చల్‌గా మారాయి. ఇంతకీ ఎవరీ శాంట్రో రవి అనేది ప్రతి ఒక్కరికీ కుతూహలంగా మారింది. అతడిని అరెస్టు చేస్తే మరెంత మంది ప్రముఖులు ఎన్నికల వేళ బయటపడతారోనని ఆసక్తికర చర్చ జరుగుతోంది. అబ్కారీ శాఖలో ఇన్‌స్పెక్టర్‌ కుమారుడైన మంజునాథ్‌ యువదశలోనే దారితప్పాడు. నేరాల తో సంబంధం కల్గినవారితో స్నేహం చేశాడు. తండ్రి అకాల మరణంతో మంజునాథ్‌ మరింత పతనమయ్యాడు. మండ్యలో ఉన్న కాలంలోనే కొందరు మహిళలతో పరిచయం చేసుకుని వేశ్యావాటికను ఆరంభించాడు. విటులను పరిచయం చేసుకుని వ్యాపారాన్ని కొనసాగించేవాడు. ఇలా వ్యాపారాల కోసమే ఓ శాంట్రో కారును కొనుగోలు చేశాడు. అదే కారులోనే మహిళలు, పురుషులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. మంజునాథ్‌ను 2000 సంవత్సరంలోనే మండ్య పోలీసులు అరెస్టు చేశారు. శాంట్రో కారును ఉపయోగించి రవి పేరిట దందా సాగించేవాడు. ఇలా శాంట్రో రవిగా ముద్ర వేసుకున్నాడు. 13 ఏళ్ల కిందటే మంజునాథ్‌ అలియాస్‌ శాంట్రో రవిగా మారాడు. పోలీసులు నిఘా పెంచడంతో మండ్యను వీడి మైసూరు(mysoor)కు చేరిన శాంట్రో రవి అక్కడ కార్యకలాపాలను కొనసాగించాడు. మహిళలతోపాటు యువతులను ప్రలోభ పరిచి తెరవెనుక దందా కొనసాగించాడు. ఇలా రాజకీయ నాయకులతో ఏర్పడిన పరిచయం వారికి ప్రత్యేక సేవలు కొనసాగించేదాకా చేరింది. కొందరు నాయకులు, పారిశ్రామికవేత్తలు కోరిన వెంటనే వారికి అనుగుణమైన వారిని సమకూర్చేవాడని పోలీసులు గుర్తించారు. ఉద్యోగాలు కల్పిస్తామని, నగదు ఆశ చూపి దందాను సాగించాడు. ఎవరైనా అభ్యంతరం తెలిపినా, బెదిరించినా రాజకీయ నాయకుల అండతో వారిపై తప్పుడు కేసులు పెట్టించేవాడనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు యువతులకు మత్తు పదార్థాలు ఇచ్చి వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేసిన ఆరోపణలు ఇతడిపై ఉన్నాయి. ఇటీవల పలువురు మంత్రులతోపాటు సీఎం కుమారుడితోనూ సన్నిహితంగా ఉన్నాడని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించడంతో శాంట్రో రవి ఎవరనేది బహిరంగమైంది. మంత్రులతో సన్నిహితంగా ఉంటున్న శాంట్రో రవి ఏకంగా ప్రభుత్వ అధికార అతిథిగృహం కుమారకృపనే అడ్డాగా చేసుకుని బదిలీలు, పదోన్నతుల పైరవీలు సాగించాడనే ఆరోపణలు వచ్చాయి. ఇతడిపై ఆరోపణలు వచ్చిన వెంటనే కుమారకృపకు చెందిన ఓ అధికారిని బదిలీ చేశారు. శాంట్రో రవి మోసం చేశాడంటూ ఆయన భార్యతోపాటు మరో మహిళ మైసూరు పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. మైసూరు నగర పోలీస్‌ కమిషనర్‌ రమేశ్‌ బానోత్‌ ఇతడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. రెండున్నరేళ్ల క్రితం ప్రభుత్వం మారినవేళ ముంబైలో గడిపిన పలువురు ఎమ్మెల్యేలకు సంబంధించిన వీడియోలు ఇతడి వద్ద ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అతడు అరెస్టు అయితే ఎన్నికలవేళ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకుంటాయని చర్చలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-01-10T11:43:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising