ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shimla: సిమ్లాకు పెరిగిన టూరిస్టుల తాకిడి.. కోలుకుంటున్న పర్యాటక రంగం

ABN, First Publish Date - 2023-10-01T17:51:24+05:30

రాష్ట్రంలో ఈ ఏడాది ప్రథామార్థంలో కురిసిన భారీ వర్షాలకు పర్యాటక రంగం(Tourist Department) తీవ్రంగా దెబ్బతింది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి క్రమంగా మారుతోంది. సిమ్లా(Simla)లో పర్యటకుల సందడి మొదలైంది. వరుస సెలవుల కారణంగా ఆ ప్రాంతానికి సందర్శకుల(Tourists) తాకిడి పెరిగింది.

హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో ఈ ఏడాది ప్రథామార్థంలో కురిసిన భారీ వర్షాలకు పర్యాటక రంగం(Tourist Department) తీవ్రంగా దెబ్బతింది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి క్రమంగా మారుతోంది. సిమ్లా(Shimla)లో పర్యటకుల సందడి మొదలైంది. వరుస సెలవుల కారణంగా ఆ ప్రాంతానికి సందర్శకుల(Tourists) తాకిడి పెరిగింది. కోల్‌కతా(Kolkata)కు చెందిన ప్రియాంక నస్కర్ అనే పర్యాటకురాలు మాట్లాడుతూ.. ''సిమ్లాకు వచ్చినందుకు చాలా హ్యపీగా ఉంది. మొదటిసారి వస్తున్నాను. చాలా రోజుల క్రితమే రావాల్సింది కానీ.. వరదలతో భయపడి వెనకడుగేశాం’’అని అన్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రవీర్ హల్దార్ అనే పర్యాటకుడు రహదారులను పునరుద్ధరించడానికి హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు.


పంజాబ్, హర్యానా, ఢిల్లీ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. ఢిల్లీకి చెందిన టూరిస్ట్ గుర్జీత్ కౌర్ మాట్లాడుతూ.. తాను సిమ్లాలో ఎంజాయ్ చేస్తున్నానని చెప్పారు. "మేం ఇక్కడికి వచ్చేటప్పుడు రోడ్లు బ్లాక్ చేసి ఉంటాయనుకున్నాం. కానీ మొత్తం మారిపోయింది. వారాంతాల్లో మాకు సెలవులు ఉంటాయి. దీంతో తప్పకుండా ఇక్కడికి వస్తుంటాం”అని అన్నారు. మిలాద్-ఉన్-నబీ, గాంధీ జయంతి తో పాటు వరుసగా సెలవులు రావడంతో సిమ్లాకి పర్యాటకులు క్యూ కట్టారు. హిమాచల్ ప్రదేశ్ హోటల్, రెస్టారెంట్, టూరిజం స్టేక్‌ హోల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మొహిందర్ సేథ్ మాట్లాడుతూ.. వరదల తాకిడి తగ్గిన తరువాత పర్యాటకుల రాక పెరిగిందని, వ్యాపారాలు లాభసాటిగా నడుస్తున్నాయని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ టూరిజం డిపార్ట్‌మెంట్ వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. దాదాపు 4 లక్షల మంది విదేశీ పర్యాటకులతో కలిపి కోటి 72 లక్షల మంది పర్యాటకులు 2019లో సిమ్లాలో పర్యటించారు. ఈ సంఖ్య 2018 తో పోలిస్తే దాదాపు 5 శాతం ఎక్కువని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-10-01T17:55:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising