Anjali accident ఘటనలో నివ్వెరపోయే నిజాలు
ABN, First Publish Date - 2023-01-04T15:11:47+05:30
దేశ రాజధాని ఢిల్లీ (Delhi accident)లో జరిగిన కారు ఘటనలో భయానకమైన విషయాలు బయటకొచ్చాయి. వైద్యులు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ (Delhi accident)లో జరిగిన కారు ఘటనలో భయానకమైన విషయాలు బయటకొచ్చాయి. వైద్యులు ఇచ్చిన శవ పరీక్షలో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. మృతురాలు అంజలి (Anjali)కి ఏ స్థాయిలో గాయాలున్నాయో సూచిస్తూ డాక్టర్లు నివేదిక ఇచ్చారు. అంజలికి బాహ్యంగా అనేక గాయాలున్నాయని, ఆమె మెదడు కనిపించలేదని పోస్టుమార్టం రిపోర్టు (Postmortem report)లో వెల్లడైంది. 14 కిలోమీటర్లు కారు కింద ఈడ్చుకుంటూ వెళ్లినందుకు చర్మం ఒలిచినట్లు.. ఆమె వెనుక భాగములో పక్కటెముకలు బయటపడ్డాయి. అలాగే ఆమె పుర్రె ఛిద్రమైందని.. మెదడులోని కొంత భాగం కనిపించలేదని నివేదికలో పొందిపరిచింది. అంజలికి ప్రమాదం జరిగినప్పుడే తల, వెన్నెముక, కింది అవయవాలపై గాయాలయ్యాయి. అంజలి లైంగిక వేధింపులకు గురైనట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని శవపరీక్ష నివేదిక స్పష్టం చేసింది.
ఏం జరిగిందంటే...
అంజలి ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (Event Management Company)లో పనిచేస్తోంది. న్యూఇయర్ పార్టీ (New Year Party)కి హాజరయ్యేందుకు అమన్ విహార్‌లోని తన ఇంటి నుంచి బయలుదేరింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి ఆలస్యంగా వస్తానని కుటుంబ సభ్యులకు అంజలి సమాచారం అందించింది. జనవరి 1న ఆదివారం తెల్లవారుజామున 3.24 గంటలకు బాలెనో కారు యాక్సిడెంట్ జరిగింది. జోంటి గ్రామం హనుమాన్ మందిర్ సమీపంలో తెల్లవారుజామున 4.11 గంటలకు పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. శరీరంపై పెద్దఎత్తున గాయాలు, బట్టలు చిరిగిపోయి రెండు కాళ్లు విరిగిపోయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక మహిళ కారు చక్రాలకు ఇరుక్కుపోయిందన్న విషయం తమకు తెలియదని, రోడ్డుపై మలుపు తీసుకుంటుండగానే ఆ విషయం తమకు అర్థమైందని నిందితులు తెలిపారు. నిందితుల దీపక్ ఖన్నా (26), అమిత్ ఖన్నా (25), క్రిషన్ (27), మిథున్ (26), మనోజ్ మిట్టల్ (27)లుగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
Updated Date - 2023-01-04T15:25:05+05:30 IST