ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Canada: కెనడాలో ఉద్రిక్తత.. హిందువు ఇంటిపై కాల్పులు..

ABN, Publish Date - Dec 29 , 2023 | 08:53 AM

కెనడా(Canada)లో ఓ హిందూ వ్యాపారవేత్త ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడటం కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లోని సర్రేలో హిందూ వ్యాపారవేత్త నివసిస్తున్నారు.

కెనడా: కెనడా(Canada)లో ఓ హిందూ వ్యాపారవేత్త ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడటం కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లోని సర్రేలో హిందూ వ్యాపారవేత్త నివసిస్తున్నారు. ఈ నెల 27న ఉదయం 8.30 నిమిషాలకు ఆయన నివసిస్తున్న ఎవెన్యూలో ఈ కాల్పులు జరిగాయి.

ఆ ఇంటిని సర్రేలోని లక్ష్మీ నారాయణ మందిర్ అధ్యక్షుడు సతీష్ కుమార్ పెద్ద కుమారుడి ఇల్లుగా గుర్తించారు. తన కుమారుడి ఇంటిపై దాడి జరిగిందని, కనీసం 14 రౌండ్లు కాల్పులు జరిపారని సతీష్ కుమార్ తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. బుల్లెట్ల విధ్వంసంతో ఇల్లు దెబ్బతింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.


దర్యాప్తు ముమ్మరం..

ఇంటిపై కాల్పులు జరపడం స్థానికంగా కలకలం సృష్టించింది. అందులోనూ హిందూ బిజినెస్ మ్యాన్ ని టార్గెట్ గా చేసుకుని కాల్పులు జరపడం పలు అనుమానాలకు తావిస్తోంది. కెనడాలోని హిందూ దేవాలయాలు, హిందువులపై ఇటీవల దాడుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీటిపై హిందూ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఖలిస్థానీ సమూహాల ఉనికి పెరుగుతుండటం.. ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య తరువాత దాడుల సంఖ్య మరింతగా పెరిగింది.

సిక్కుల అనుకూల వర్గాలు హిందువులను టార్గెట్ గా చేసుకున్నాయా అనే అనుమానాలు లేకపోలేదు. భారత్ లోని సిక్కులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆ మత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హిందువులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తోంది. కాల్పులపై కెనడియన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Dec 29 , 2023 | 08:55 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising