Konark Chakra : కోణార్క్ చక్రం నమూనాను చూపుతూ..
ABN, First Publish Date - 2023-09-10T04:57:21+05:30
జీ20 సదస్సుకు వస్తూనే విశిష్ట అతిథులకు భారత శిల్ప కళా సంపద కట్టిపడేసింది. సదస్సు వేదిక అయిన ‘భారత మండపం’ వద్ద ఆహ్వానితులకు స్వాగతం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: జీ20 సదస్సుకు వస్తూనే విశిష్ట అతిథులకు భారత శిల్ప కళా సంపద కట్టిపడేసింది. సదస్సు వేదిక అయిన ‘భారత మండపం’ వద్ద ఆహ్వానితులకు స్వాగతం పలికే చోట ఒడిసా సూర్యదేవాలయంలోని ‘కోణార్క్ చక్రం నమూనా’ను ఏర్పాటు చేశారు. దాని ఎదురుగా ప్రధాని మోదీ నిల్చుని.. అమెరికా అధ్యక్షుడు బైడన్ సహా వివిధ దేశాధినేతలకు స్వాగతం పలికారు. కోణార్క్ చక్రం విశిష్టతను కొందరికి ఆయన వివరించే ప్రయత్నం చేశారు. కోణార్క్ చక్రాన్ని 13వ శతాబ్దంలో రాజా నరసింహదేవ్-1 హయాంలో నిర్మించారు. భారత ప్రాచీన విజ్ఞాన సంపద, నాగరికత శిల్పకళా ఔన్నత్యానికి చిహ్నంగా కోణార్క్ చక్రాన్ని అభివర్ణిస్తారు. ఇలాంటి చక్రాలు సూర్య దేవాలయంలో 12 జతలున్నాయి. ఇవి కాలగమనాన్ని సూచిస్తాయని, రాశీ చక్రాలకు ప్రతీకలని ప్రతీతి.
Updated Date - 2023-09-10T04:57:21+05:30 IST