ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రికులు తినకూడని ఆహార పదార్థాలు ఇవే!

ABN, First Publish Date - 2023-06-10T12:28:48+05:30

అత్యంత పవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర త్వరలో ప్రారంభం కాబోతోంది. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారు తినవలసిన ఆహారానికి సంబంధించిన మెనూలో కొన్ని మార్పులు చేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అత్యంత పవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) త్వరలో ప్రారంభం కాబోతోంది. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారు తినవలసిన ఆహారానికి సంబంధించిన మెనూలో కొన్ని మార్పులు చేయాలని శ్రీ అమర్‌నాథ్‌జీ ష్రైన్ బోర్డ్ (Shri Amarnathji Shrine Board) నిర్ణయించింది. 62 రోజులపాటు సాగే ఈ యాత్రను ఈ బోర్డు నిర్వహిస్తుందనే సంగతి తెలిసిందే.

శ్రీ అమర్‌నాథ్‌జీ ష్రైన్ బోర్డ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, హై కేలరీ ఆహార పదార్థాల వల్ల భక్తుల ఆరోగ్యం దెబ్బతింటుందనే ఉద్దేశంతో మెనూలో కొన్ని మార్పులు చేశారు. బాగా వేయించిన ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, జిలేబీ, గులాబ్ జామ్, రసగుల్లా, చోళ-భటుర, పూరీలు, పిజ్జా బర్గర్లు, దోశలు, చౌమీన్ వంటివాటిని ఈ యాత్రలో భక్తులు తినకూడదు. ఈ మేరకు ఆహార పదార్థాలను, తినుబండారాలను విక్రయించే అన్ని రకాల దుకాణాలకు ఆదేశాలు జారీ చేశారు.

హై ప్రొటీన్, కార్బొహైడ్రేట్లుగల ఆహార పదార్థాలను భక్తులకు అందుబాటులో ఉంచేందుకు ఈ బోర్డు ఆమోదం తెలిపింది. ఇటువంటి తినుబండారాలను తినడం వల్ల భక్తులకు శక్తి రావడంతోపాటు ఆరోగ్యంగా ఉంటారని, శరీరం తేలికగా ఉంటుందని చెప్తున్నారు. భక్తులు తినడానికి అందుబాటులో ఉండే ఆహార పదార్థాలు ఏమిటంటే..

- అన్నం

- వేయించిన శనగపప్పు

- అటుకులు

- ఊతప్పం

- ఇడ్లీ

- దాల్-రోటీ

- చాకొలెట్లు

- ఖీర్

- ఓట్స్

- డ్రై ఫ్రూట్స్

- తేనె

- బాయిల్డ్ స్వీట్స్

కొన్ని రకాల ఆహార పదార్థాలు భక్తులకు తగినవి కాదని పరిశీలనలో వెల్లడి కావడంతో ఈ నూతన మెనూను బోర్డు సిద్ధం చేసింది.

మంచు పర్వత ప్రాంతంలో 14 కిలోమీటర్ల మేరకు ప్రయాణించి, అమరనాథుడిని భక్తులు దర్శించుకుంటారు. ఇటువంటి ప్రాంతంలో ప్రయాణించేవారు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగానే తెలుసుకుని, అందుకు అనుగుణంగా వ్యవహరించడం వల్ల అమరలింగేశ్వరుని దర్శనం సజావుగా జరిగి, ఆశీర్వాదాలు స్వీకరించి, సంతృప్తిగా ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు.

ఆరోగ్య రంగంలో నిపుణులు చెప్తున్నదాని ప్రకారం, ఎత్తయిన ప్రదేశాల్లో ప్రయాణించేవారికి పండ్లు, కూరగాయలు అందుబాటులో లేని సమయంలో విటమిన్లు, మినరల్స్‌తో కూడిన ఆహారం అవసరమవుతుంది. హైపోక్సియాను తప్పించుకోవాలంటే ఐరన్, విటమిన్ డీ సప్లిమెంట్లను కూడా తీసుకోవాలి. ఎత్తయిన ప్రదేశాల్లో ఆక్సిజన్ (ప్రాణ వాయువు) స్థాయి 90 శాతం కన్నా తక్కువకు తగ్గుతుంది. దీనివల్ల అస్వస్థతకు గురవుతారు. వాతావరణానికి అలవాటు పడాలని అనుకోకుండా , స్వీకరించే ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే, ప్రతి మూడు గంటలకు కనీసం ఒక లీటరు నీటిని కొంచెం ఉప్పు కలుపుకొని తాగాలి.

ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లేవారికి శక్తి కావాలంటే ముఖ్యంగా కార్బొహైడ్రేట్లను తీసుకోవాలి. బ్లడ్ సుగర్ లెవెల్స్‌ను మెయింటెయిన్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి.

ప్రాణ వాయువు (ఆక్సిజన్) సామర్థ్యాన్ని పెంచడంలో యాంటీఆక్సిడెంట్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. సెల్స్‌కి ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని నివారిస్తాయి. శ్వాస తీసుకోవడాన్ని మెరుగుపరుస్తాయి. ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

ఎత్తయిన ప్రదేశాల్లో ఆల్కహాల్, కెఫీన్ వాడటం మానేయాలి. ఎనర్జీ బార్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ తాగవచ్చు. భోజనం మానకూడదు. హై ఫ్యాట్ ఫుడ్‌ను తినకూడదు. మూత్ర విసర్జన చేయవలసి వస్తుందనే ఉద్దేశంతో నీటిని తాగడం తగ్గించకూడదు.

ఇవి కూడా చదవండి :

Donald Trump : ట్రంప్‌పై కేసు.. ఆయన ఏమేం దాచిపెట్టారంటే..

Amazon rainforest : కూలిన విమానం.. గల్లంతైన నలుగురు బాలలు.. 40 రోజుల తర్వాత సజీవంగా..

Updated Date - 2023-06-10T12:28:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising