Himanta Sarma: టిప్పు కుటుంబ సభ్యులు సిద్ధూ, డీకే..!
ABN, First Publish Date - 2023-05-06T19:03:49+05:30
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు బీజేపీ కేంద్ర అగ్రనాయకత్వం ఆ రాష్ట్రంలో అలుపెరగని ప్రచారం సాగిస్తోంది. కొడగు జిల్లా విరజ్‌పేటలో ఎన్నికల ప్రచారం ..
కొడగు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు బీజేపీ కేంద్ర అగ్రనాయకత్వం ఆ రాష్ట్రంలో అలుపెరగని ప్రచారం సాగిస్తోంది. కొడగు జిల్లా విరజ్‌పేటలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్న అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) శనివారంనాడు మరోసారి కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు టిప్పు సుల్తాన్ ''కుటుంబ సభ్యులు'' అంటూ విమర్శించారు.
''నేను అసోం నుంచి వచ్చాను. అసోంలో మాపై మొఘలులు 17 సార్లు దాడి చేశారు. అయితే మమ్మల్ని మొఘలులు ఓడించలేకపోయారు. టిప్పు సూల్తాన్‌ను అనేక సార్లు కొడగు ప్రజలు ఓడించారు. ఈ నేలకు నేను శిరసు వంచి అభివాదం చేస్తున్నాను'' అని అన్నారు. టిప్పు సుల్తాన్ దాడుల్లో 80,000 మంది ప్రాణ త్యాగాలు చేశారని, ఆలాంటి టిప్పు సుల్తాన్ జయంతిని చేస్తామని సిద్ధరామయ్య అంటున్నారని, ఆయన ఆ పని చేయాలనుకుంటే పాకిస్థాన్‌లోనో, బంగ్లేదేశ్‌లోనో చేసుకోవచ్చని, ఇండియాలో చేసుకునే హక్కు మాత్రం లేదని అసోం సీఎం అన్నారు. కాంగ్రెస్ కనుక మళ్లీ అధికారంలోకి వస్తే కర్ణాటక క్రమంగా నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) వ్యాలీగా మారిపోతుందని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10న జరుగనుండగా, 13న ఫలితాలు వెల్లడవుతాయి.
Updated Date - 2023-05-06T19:04:19+05:30 IST