ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sikkim: వచ్చే ఏడాది నాటికి సిక్కింకు మొట్టమొదటి రైల్వే సర్వీసు

ABN, First Publish Date - 2023-06-01T07:48:11+05:30

పెద్ద పెద్ద కొండలు...ఘాట్ రోడ్లతో కూడిన ఈశాన్య రాష్ట్రమైన సిక్కింకు త్వరలో మొట్టమొదటి రైలు రానుంది.భారతీయ రైల్వే పశ్చిమ బెంగాల్‌లోని సివోక్‌ను సిక్కింలోని రంగ్‌పో రైల్వేస్టేషనుతో కలిపే కొత్త రైల్వే ప్రాజెక్టును 2024 నాటికి పూర్తి చేయనుంది....

Sikkim to get train service
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్యాంగ్‌టక్ : పెద్ద పెద్ద కొండలు...ఘాట్ రోడ్లతో కూడిన ఈశాన్య రాష్ట్రమైన సిక్కింకు త్వరలో మొట్టమొదటి రైలు రానుంది.భారతీయ రైల్వే పశ్చిమ బెంగాల్‌లోని సివోక్‌ను సిక్కింలోని రంగ్‌పో రైల్వేస్టేషనుతో కలిపే కొత్త రైల్వే ప్రాజెక్టును 2024 నాటికి పూర్తి చేయనుంది.(Sikkim to get train service)శివోక్‌-రాంగ్‌పో రైల్వే ప్రాజెక్టు పనులు(Sivok-Rangpo project) త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే అధికారులు ప్రకటించారు.

శివోక్-రాంగ్‌పో రైల్వే ప్రాజెక్ట్ 45కిలోమీటర్ల పొడవుతో ఐదు స్టేషన్లు ఉన్నాయి.ఈ రైలుమార్గం పనులు పూర్తి అయితే 2024లో సిక్కిం దేశంలోని మిగిలిన ప్రాంతాలకు రైళ్ల ద్వారా అనుసంధానిస్తామని రైల్వే అధికారులు ప్రకటించారు. బెంగాల్‌లోని తీస్తా బజార్‌లో భూగర్భ రైల్వేస్టేషన్‌ను నిర్మించారు.శివోక్ నుంచి రంగ్‌పో వరకు కొత్త రైలు లింక్ ప్రాజెక్ట్ 14 సొరంగాలు, 22 వంతెనలు, 5 స్టేషన్‌లు నిర్మిస్తున్నట్లు రైల్వే ప్రాజెక్ట్ డైరెక్టర్ మహీందర్ సింగ్ చెప్పారు.

ఈ రైల్వే ప్రాజెక్టులో దాదాపు 38 కిలోమీటర్ల దూరం సొరంగాల ద్వారా కలుపుతున్నారు. ఇప్పటికే 76 శాతం టన్నెల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఆరు సొరంగాల తవ్వకం ఇప్పటికే పూర్తయింది. సొరంగాల తుది కాంక్రీట్ లైనింగ్ పూర్తయింది. ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ల్యాండ్ లాక్డ్ స్టేట్ సిక్కింకు కనెక్టివిటీ బూస్ట్ లభించనుంది.

Updated Date - 2023-06-01T07:56:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising