‘కోడ్’పై మౌనం పాటించండి:షాహీ ఇమామ్
ABN, First Publish Date - 2023-07-02T03:56:49+05:30
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫారం సివిల్ కోడ్‌యూసీసీ)పై ముస్లిం సంఘాలేవీ మాట్లాడకుండా మౌనంగా ..
న్యూఢిల్లీ, జూలై1: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫారం సివిల్ కోడ్‌యూసీసీ)పై ముస్లిం సంఘాలేవీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలంటూ ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్ ఫత్వా జారీ చేశారు. ఈద్ సందర్భంగా ఈ ఫత్వాను ఇచ్చారని, ఆ సమయంలో ఆయన విదేశాల్లో ఉన్నారని తెలిసింది. మరోవైపు వచ్చే లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతిపై ప్రతిపాదనలు తీసుకొస్తుందన్న సమాచారంపై ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందించింది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ముస్లింలకు ప్రత్యేక పర్సనల్ లా ఉందని తెలిపింది. పర్సనల్ లా బోర్డును రద్దు చేయడమే కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోందని ఓ ప్రకటనలో పేర్కొంది.
Updated Date - 2023-07-02T03:56:49+05:30 IST