ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sonia Gandhi: కష్టాలకు ఎదురీది.. కన్నీటిని దిగమింగి

ABN, First Publish Date - 2023-02-26T02:56:20+05:30

ఇటలీలో పుట్టి పెరిగి రాజీవ్‌ గాంధీ భార్యగా, ఇందిరా గాంధీ కోడలిగా భారత్‌లో అడుగిడిన సోనియా గాంధీ.. దేశ రాజకీయాల్లో ఓ సంచలనం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన సోనియా గాంధీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఇటలీలో పుట్టి పెరిగి రాజీవ్‌ గాంధీ భార్యగా, ఇందిరా గాంధీ కోడలిగా భారత్‌లో అడుగిడిన సోనియా గాంధీ.. దేశ రాజకీయాల్లో ఓ సంచలనం. రాజీవ్‌ మరణం దేశంలో రాజకీయ అస్థిరతకు కారణమైన వేళ.. సోనియాను ప్రధానిని చేయాలని కాంగ్రెస్‌ పెద్దలు తలపోసినా అందుకు ఆమె అంగీకరించలేదు. తర్వాత పార్టీ ఓటమి, నేతల తిరుగుబాటు, చీలికలతో ఆమె రంగంలోకి దిగి.. పార్టీని ఒకటి చేసేందుకు నడుంబిగించారు. 1997లో పార్టీ సభ్యత్వం తీసుకున్న కొన్ని రోజుల్లోనే కాంగ్రెస్‌ అధ్యక్షురాలయ్యారు. 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. సోనియా ప్రధాని కాలేదన్న మాటే కానీ పదేళ్ల పాటు ఆ పదవిలో ఉన్న మన్మోహన్‌ సింగ్‌ వేసిన ప్రతి అడుగు వెనక ఆమె ఉన్నారు.

కేంబ్రిడ్జిలో చిగురించిన ప్రేమ

రాజీవ్‌ 1966లో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఓసారి స్నేహితులతో కలిసి వర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్లారు. అదే వర్సిటీలో చదువుతున్న సోనియాగాంధీ ఆ రెస్టారెంట్‌లో వెయిట్రె్‌సగా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నారు. అప్పుడు తొలిసారి సోనియాను చూసిన రాజీవ్‌ ఆమెతో ప్రేమలో పడిపోయారు. 1968లో హిందూ సంప్రదాయ పద్ధతిలో న్యూఢిల్లీలో వారి వివాహం జరిగింది. రాజీవ్‌, సోనియా దంపతులకు 1970లో రాహుల్‌ గాంధీ, 1972లో ప్రియాంకా గాంధీ జన్మించారు. ఎన్నికల ప్రచారంలో ఉండగా 21 మే 1991లో తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్‌ గాంధీ మరణించారు. ఆయన మరణం దేశంలో రాజకీయ అస్థిరతకు కారణమైంది.

సోనియా గాంధీని ప్రధానిని చేయాలని కాంగ్రెస్‌ పెద్దలు తలపోసినా అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. అయితే 1996లో ఓటమి తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చీలిక మొదలైంది. దీంతో సోనియా రంగంలోకి దిగక తప్పలేదు. పార్టీని ఒక్కటి చేసేందుకు నడుం బిగించారు. 1997లో కలకత్తా ప్లీనరీ సమావేశంలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. తర్వాత 62 రోజుల్లోనే పార్టీ ఆమెను అధ్యక్షురాలిగా ఎన్నుకుంది. 1999లో కర్ణాటకలోని బళ్ళారి, ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గాల నుంచి లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత రాయ్‌బరేలీ నుంచి పలుమార్లు విజయం సాధించారు.

అధ్యక్షురాలిగా సోనియా రికార్డు

1999లో బీజేపీ అధికారంలోకి వచ్చి వాజ్‌పేయి ప్రధాని అయినప్పుడు సోనియా గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2004 నుంచి యూపీఏ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. 2010 సెప్టెంబరులో వరుసగా నాలుగోసారి కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైన సోనియా.. ఆ పార్టీకి ఎక్కువకాలం అధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉన్న సోనియా గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేసినా ఆమె నిరాకరించారు.

Updated Date - 2023-02-26T03:20:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising