ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Stalin on BJP: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల పేరుతో బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్: సీఎం స్టాలిన్

ABN, First Publish Date - 2023-09-17T13:17:09+05:30

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల(Parliament Special Sessions) పేరుతో బీజేపీ(BJP) డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) విమర్శంచారు. బీజేపీని విమర్శిస్తూ ఆయన ఎక్స్(X) లో పోస్ట్ చేశారు.

చెన్నై:పార్లమెంటు ప్రత్యేక సమావేశాల(Parliament Special Sessions) పేరుతో బీజేపీ(BJP) డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) విమర్శంచారు. బీజేపీని విమర్శిస్తూ ఆయన ఎక్స్(X) లో పోస్ట్ చేశారు. అందులో.. సెప్టెంబర్ 18 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో మణిపుర్ హింస(Manipur Riots), కాగ్ నివేదిక(CAG report)లో అవకతవకలను తూర్పార పట్టడమే అజెండాగా ఇండియా కూటమి ప్రశ్నిస్తుందని ఆయన అన్నారు. ప్రతిపక్ష కూటమి లక్ష్యం స్పష్టంగా ఉందని, బీజేపీ ఫిరాయింపు రాజకీయాలను తాము లొంగబోమని స్పష్టం చేశారు.


ఎన్డీయే కూటమి కుట్రాల్ని ఎండగడతామని అన్నారు. మహిళా బిల్లు, బీసీ రిజర్వేషన్ తదితర బిల్లుల ఆమోదానికే సమావేశాలు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు జమిలీ(Jamili Elections) ఎన్నికలను నిర్వహించాలని బీజేపీ మదిలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 18 నుంచి 22 మధ్య ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 18న పాత భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయని, గణేష్ చతుర్థి సందర్భంగా సెప్టెంబరు 19న కొత్త భవనంలో సమావేశాలు ప్రారంభిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆగస్టులో ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Monsoon Sessions) పాత పార్లమెంట్ భవనంలో జరిగాయి. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - 2023-09-17T15:00:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising